బ్రెడ్ కారట్ బాసుంది
బ్రెడ్ తో ఏ స్వీట్ చేసినా చాలా రుచిగా ఉంటుంది.పిల్లలూ ఇష్టంగా
తింటారు ఎక్కువ నెయ్యి అవసరం లేకుండా సింపుల్ గా రెడీ అయ్యే
ఈ స్వీట్ కి కొంచెం కారట్ జత చేస్తే కలర్ ఫుల్ గా ఈ బాసుంది
తయారవుతుంది.
కావలసిన పదార్ధాలు:
బ్రెడ్ నాలుగు స్లైసులు
కారట్ తురుము ఒక కప్పు
పంచదార ఒకటిన్నర కప్పు
పాలు అరలీటరు
నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు
ఇలాచీ పొడి ఒక స్పూను
కాజూ పది
యిన్ స్టంట్ బాదం మిక్స్ పౌడర్ ఒక స్పూను
యిన్ స్టంట్ బాదం మిక్స్ పౌడర్ ఒక స్పూను
తయారు చేసే విధానం :
బ్రెడ్ స్లైసెస్ ని మిక్సీ లో వేసి క్రంబ్స్ గా చేసుకోవాలి .
ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేడి చేసి ఈ క్రంబ్స్ ని కొంచెం వేయించి
తీసుకోవాలి
ఇంకో టేబుల్ స్పూన్ నెయ్యి వేడి చేసి కారట్ తురుమును కొంచెం
వేయించాలి.
పాలని కొంచెం మరిగించి అందులో ఈ వేయించిన బ్రెడ్ క్రంబ్స్,కారట్
తురుము వేసి కొంచెం ఉడకనివ్వాలి.
ఇప్పుడు పంచదార కలిపి కొంచెం చిక్కబడేదాకా ఉడికించి ఇలాచీ పొడి
వేసి కలపాలి.
యిన్ స్టంట్ బాదంమిక్స్ పౌడర్ వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చెయ్యాలి.
ఇది వేస్తే కొంచెం ఫ్లేవర్,కలర్ బావుంటుంది.లేకపోయినా పర్లేదు.
యిన్ స్టంట్ బాదంమిక్స్ పౌడర్ వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చెయ్యాలి.
ఇది వేస్తే కొంచెం ఫ్లేవర్,కలర్ బావుంటుంది.లేకపోయినా పర్లేదు.
ఒక బౌల్ లోకి తీసుకుని వేయించిన కాజూతో అలంకరించాలి.
ఫ్రిజ్ లో ఉంచి చల్లగా సర్వ్ చేస్తే ఈ బాసుందీ చాలా రుచిగా ఉంటుంది.
3 comments:
Very nice.Kids like it very much.
Bhale undi.Tempting gaaa...tineyali anipinchelaa :)
అవును ఇందూ మా పాపకి చాలా ఇష్టం రెండు స్లైసెస్ ఉన్నా తనకి చేసి పెడతాను
Post a Comment