గోల్డెన్ బర్ఫీ
దీనినే సెవెన్ కప్ స్వీట్ అని కూడా అంటారు.చాలా ఈజీగా
పావుగంటలో అయిపోయే స్వీట్ ఇది.
పావుగంటలో అయిపోయే స్వీట్ ఇది.
కావలసిన పదార్ధాలు :
శనగపిండి ఒక కప్
పచ్చికొబ్బరి తురుము ఒక కప్
పాలు ఒక కప్
నెయ్యి ఒక కప్
పంచదార మూడు కప్పులు
కాజూ పది
ఇలాచీ పొడి ఒక టీ స్పూను
తయారు చేసే విధానం:
అన్నీ ఒక పాన్ లో వేసి బాగా కలిపి స్టవ్ మీద పెట్టి ఉడికించాలి
దగ్గరవుతుండగా వేయించిన కాజూ,ఇలాచీపొడి వేసి కలిపి నెయ్యి
రాసిన ప్లేట్లో పోసి కొంచెం చల్లారాక ముక్కలు కట్ చేసుకోవాలి.
ఈ స్వీట్ ని మైక్రోవేవ్ లో చెయ్యాలంటే అన్నీ ఒక పెద్ద గాజుబౌల్ లో
వేసి బాగా కలిపి హైలో పెట్టి ఉడికించాలి.మూడు నిమిషాలకు ఒకసారి
తీసి కలుపుతూ,దగ్గరయ్యాక నెయ్యి రాసిన ప్లేట్ లో పోయాలి.
ఈ స్వీట్ ని మైక్రోవేవ్ లో చెయ్యాలంటే అన్నీ ఒక పెద్ద గాజుబౌల్ లో
వేసి బాగా కలిపి హైలో పెట్టి ఉడికించాలి.మూడు నిమిషాలకు ఒకసారి
తీసి కలుపుతూ,దగ్గరయ్యాక నెయ్యి రాసిన ప్లేట్ లో పోయాలి.
0 comments:
Post a Comment