Tuesday, February 15, 2011

వెజిటబుల్ సేమ్యా ఉప్మా

చాలా  త్వరగా  అయిపోయే  టేస్టీ టిఫిన్ ఈ సేమ్యా ఉప్మా.ఇందులోనే 

వెజిటబుల్స్ కూడా వేసి చేస్తే పిల్లలూ ఇష్టంగా తింటారు.బాక్స్ లో పెట్టి 

ఇచ్చినా బావుంటుంది.





కావలసిన పదార్ధాలు:

సేమ్యా                           ఒక గ్లాస్ 

ఆలూ                            ఒకటి 

కారట్                            ఒకటి 

టమాటా                        ఒకటి 

ఉల్లిపాయ                      ఒకటి 

మిర్చి                          మూడు

కరివేపాకు                      ఒక రెమ్మ 

కొత్తిమీర                       కొంచెం 

పసుపు                       చిటికెడు 

ఉప్పు                           తగినంత 

అల్లంవెల్లుల్లి ముద్ద           అర టీ స్పూను 

గరంమసాలా పొడి            అర స్పూను 

నూనె                            మూడు టేబుల్ స్పూన్లు 

జీడిపప్పు                       కొంచెం 

నీళ్ళు                              ఒక గ్లాస్ 

తాలింపుకు                      శనగపప్పు,మినప్పప్పు ,ఆవాలు

తయారు చేసే విధానం:

ముందుగా ఒక టేబుల్ స్పూన్ నూనె వేడిచేసి సేమ్యా వేయించి 

తీసుకోవాలి.

ఒక గిన్నెలో మిగిలిన నూనె వేడి చేసి తాలింపు వేసి,జీడిపప్పు కూడా 

వేసి దోరగా వేయించాలి.

ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లి,మిర్చి,ఆలూ,కారట్,కరివేపాకు వేసి 

కొంచెం వేగాక టమాటా ముక్కలు వెయ్యాలి.

తరువాత పసుపు,అల్లంవెల్లుల్లి ముద్ద,గరంమసాలా పొడి,కొత్తిమీర వేసి 

బాగా కలిపి  కొంచెం ఉడికించి ,నీరు పొయ్యాలి.

తగినంత  ఉప్పు వేసి నీళ్ళు మరిగిన తరువాత వేయించిన సేమ్యా 

వెయ్యాలి.

ఒకసారి కలిపి ఈ గిన్నెను ప్రెషర్ పాన్ లో ఉంచి మూడు విజిల్స్ 

రానిస్తే సేమ్యా ఉప్మా రెడీ అవుతుంది.

కుక్కర్ లో కాకుండా సేమ్యా ఉడికేవరకూ ఉంచి విడిగా కూడా 

చేసుకోవచ్చు.

నోట్: గ్లాస్ అయినా కప్ అయినా సేమ్యా దేనితో తీసుకున్నామో 

నీళ్ళుకూడా కరెక్ట్ గా దానితోనే పొయ్యాలి.


Share/Bookmark

6 comments:

జ్యోతి

లతగారు, నేను ఇలాగే చేస్తాను కాని కూరగాయలన్నీ పోపులో మగ్గనిచ్చి, సేమ్యాను విడిగా ముప్పాతిక ఉడకబెట్టి నీళ్లు వడకట్టి వేస్తాను (నూడుల్స్ లాఙ . దీనివల్ల సేమ్యా పొడిపొడిగా వస్తుంది.

లత

జ్యోతిగారూ,
సేమ్యా పులిహోరకి నేనూ అలాగే చేస్తాను అండీ,
ఈ ఉప్మా మా పిల్లలు కొంచెం మెత్తగా ఇష్టపడతారు అందుకని ఇలా చేస్తాను.
థాంక్స్ అండీ

రాధిక(నాని )

బాగుందండి.నేను జ్యోతిగారిలానే చేస్తాను. .

సుమలత

బాగుందండి ......

లత

రాధికా, సుమలతా
థాంక్యూ

Unknown

Super

Post a Comment

అభిరుచి   © 2008. Template Recipes by Emporium Digital

TOP