చిల్లీ కొరియాండర్ చికెన్ కర్రీ
నాన్ వెజ్ లో చికెన్ ఇష్టపడని వారు ఎవరూ ఉండరు కదా ఎప్పుడూ
ఒకే రకంగా వండినా బోర్ అనిపిస్తుంది.అవే పదార్ధాలు అయినా కొంచెం
మార్చి వండితే కొత్త రుచితో బావుంటుంది ఏ వంటకం అయినా.అలా
చేసినదే ఈ చికెన్ కూర.చాలా రుచిగా ఉంది.మీరూ చేసి చూడండి.
కావలసిన పదార్ధాలు :
చికెన్ అర కిలో
ఉల్లిపాయ రెండు
మిర్చి ఆరు
కొత్తిమీర అర కప్పు
అల్లంవెల్లుల్లి ముద్ద రెండు టీస్పూన్లు
కరివేపాకు ఒక రెమ్మ
ఉప్పు,కారం తగినంత
పసుపు కొంచెం
నూనె అర కప్పు
మసాలాకు
లవంగాలు ఆరు
చెక్క రెండు ముక్కలు
ధనియాలు ఒక టేబుల్ ద్పూను
జీలకర్ర ఒక టేబుల్ స్పూను
గసగసాలు ఒక టేబుల్ స్పూను
ఎండుకొబ్బరి చిన్న ముక్క
తయారు చేసే విధానం :
ముందుగా మసాలాకు రాసినవి అన్నీ మెత్తగా పొడి కొట్టుకోవాలి.
కొత్తిమీర ,మిర్చి కలిపి గ్రైండ్ చేసుకోవాలి.
నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు,కరివేపాకు వేసి
వేయించాలి.
వేగిన తరువాత ,పసుపు, కారం ,అల్లంవెల్లుల్లి ముద్ద,మిర్చి కొత్తిమీర
ముద్ద ఒక దాని తరువాత ఒకటి వేసి వేయించాలి.
నూనె పైకి తేలాక చికెన్ ముక్కలు వేసి కలిపి,కొంచెం ఉడికించాలి.
ఇప్పుడు మసాలాపొడి,తగినంత ఉప్పు వేసి బాగా కలిపి కొంచెం నీళ్ళు
పోసి,మూత పెట్టి సన్నని సెగపై ఉడికించుకోవాలి.
చికెన్ మెత్తగా ఉడికి కూర బాగా చిక్కబడిన తరువాత, బౌల్ లోకి
తీసుకుని కొత్తిమీర చల్లి సర్వ్ చెయ్యాలి.

2 comments:
మొన్న మీ కొరియాండర్ చికెన్ ట్రై చేసామండీ. చాలా బాగా వచ్చింది. thanks a lot
కోరియాండర్ చికెన్ తినలేదు కానీ జింజర్ చికెన్ తిన్నాను. బొమికలు తీసేసిన చికెన్ దేనితో చేసినా బాగుంటుంది.
Post a Comment