వంకాయ పకోడీ కూర
కూరలలో చాలామంది ఇష్టంగా తినేది వంకాయ కూర.ఆహా ఏమి రుచి
అన్నా, ఏమి అన్నా ఈ వంకాయ కే చెల్లింది.అలాగే వంకాయ అనగానే
గుత్తొంకాయ,బగార బైగన్, వంకాయ కొత్తిమీర కారం ఎక్కువ ఇవే
గుర్తొస్తాయి.కానీ పొడుగ్గా సన్నగా ఉండే వంకాయలతో అల్లం,మిర్చి
వేసి చేసే వేపుడు చాలా రుచి గా ఉంటుంది.దానికి పకోడీ కూడా తోడైతే
ఆ రుచి ఇంకా బావుంటుంది.

కావలసిన పదార్ధాలు:
వంకాయలు పావు కిలో
ఉల్లిపాయ ఒకటి చిన్నది
కరివేపాకు ఒక రెమ్మ
అల్లం చిన్న ముక్క
మిర్చి నాలుగు
ఉప్పు, కారం తగినంత
పసుపు కొంచెం
గరంమసాలా పొడి ఒక స్పూను
నూనె మూడు టేబుల్ స్పూన్లు
తాలింపుకు శనగపప్పు,మినప్పప్పు,జీలకర్ర,ఆవాలు,ఎండుమిర్చి
పకోడీలకు :
శనగపిండి ఒక కప్పు
వరి పిండి రెండు స్పూన్లు
ఉల్లిపాయ ఒకటి
మిర్చి మూడు
అల్లం చిన్న ముక్క
కరివేపాకు ఒక రెమ్మ
కొత్తిమీర ఒక కట్ట
ఉప్పు తగినంత
వంట సోడా చిటికెడు
నూనె
తయారు చేసే విధానం:
నూనె వేడి చేసి శనగపప్పు.మినప్పప్పు.జీలకర్ర ,ఆవాలు,ఎండుమిర్చి
వేసి తాలింపు వేసుకోవాలి. అవి వేగాక కరివేపాకు వెయ్యాలి.
సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి.
ఇప్పుడు సన్నగా కోసిన వంకాయముక్కలు వేసి,సన్నని సెగపై మూత
పెట్టకుండా వేగనివ్వాలి.ముక్కలు కొంచెం మగ్గిన తరువాత
పెట్టకుండా వేగనివ్వాలి.ముక్కలు కొంచెం మగ్గిన తరువాత
పసుపు,అల్లం,మిర్చి కలిపి నూరిన ముద్ద వేసి బాగా కలిపి అదే
సెగలో వేగనివ్వాలి.
ముక్కలు బాగా వేగిన తరువాత తగినంత ఉప్పు,కారం, గరం మసాలా
పొడి చల్లి బాగా కలపాలి
ఈ లోగా పకోడీ లకు కావలసిన అన్నింటిని కొంచెం నీటితో పకోడీ
పిండిలా కలుపుకోవాలి.మరో స్టవ్ పై నూనె వేడిచేసి పకోడీలు
వేసుకోవాలి.
వంకాయముక్కలు వేగేలోగా అటు పకోడీలు కూడా రెడీ అయిపోతాయి.
వేగిన పకోడీలను సన్నగా తరిగి కూరలో కలిపి,రెండు నిమిషాలు
వేయించి,తరిగిన కొత్తిమీర చల్లితే ఘుమఘుమలాడే వంకాయ పకోడీ
కూర రెడీ అవుతుంది.
వేయించి,తరిగిన కొత్తిమీర చల్లితే ఘుమఘుమలాడే వంకాయ పకోడీ
కూర రెడీ అవుతుంది.
నోట్: ఈ కూరలో ఉప్పు మాత్రం చివరికి వెయ్యాలి.ముందే వేస్తే
వంకాయ ముక్కలు ముద్దగా అయిపోతాయి.
3 comments:
ఇలా కాకుండా వంకాయతోనే పకోడీలాగా వేసి చేసే కూర గురించి తెలిస్తే కొంచెం చెబుదురూ!
తెలియదు ఇందూ,
నాకు తెలిసి జనరల్ గా వంకాయ ముక్కలు డీప్ ఫ్రై చేసి,వాటిని పకోడీలతో కలిపి చేస్తారు.
అలా డీప్ ఫ్రై చెయ్యడం ఇష్టం లేక నేను ఇలా చేస్తాను.
ఓహో! ఓకే.ఒకే. :)
Post a Comment