Friday, December 24, 2010

బ్రెడ్ పుడ్డింగ్

కమ్మగా, మధురం గా ఉండే స్వీట్స్ అంటే అందరికీ ఇష్టమే.ఎన్ని 

తిన్నాఇంకా తినాలని అనిపిస్తుంది.  బ్రెడ్, ఎగ్స్ కలిపి చేసే ఈ 

పుడ్డింగ్ చేయడం చాలా సులువు. పిల్లలు చాలా ఇష్టం గా తింటారు 

కూడా.













కావలసిన పదార్ధాలు :

బ్రెడ్                   నాలుగు  స్లైసులు 

ఎగ్స్                  రెండు 

పాలు                 రెండు  కప్పులు 

పంచదార పొడి       ఒక కప్పు

వెనీలా ఎసెన్స్       అర స్పూను 

ఇలాచీ  పొడి         కొంచెం 

నెయ్యి                మూడు  టేబుల్ స్పూన్లు 

కాజూ,చెర్రీస్          అలంకరణకి  


తయారు చేసే విధానం :


ముందుగా బ్రెడ్ స్లైసెస్ ని  మిక్సీ లో క్రంబ్స్  లా చేసుకోవాలి. 

ఒక మైక్రోవేవ్ సేఫ్ బౌల్ లో  రెండు స్పూన్లు నెయ్యి, బ్రెడ్ క్రంబ్స్ వేసి  

ఒక నిమిషం హై లో పెట్టాలి.తరువాత ఒకసారి కలిపి టెంపరేచర్ తగ్గించి 

ఇంకో నిమిషం పెడితే క్రిస్ప్ గా ఫ్రై అవుతాయి.

ఒక బౌల్ లో ఎగ్స్ వేసి బాగా బీట్ చెయ్యాలి. ఇందులో పాలు,

పంచదార పొడి  వేసి  బాగా కలిసేలా బీట్ చెయ్యాలి.

ఈ బీట్ చేసిన మిశ్రమంలో వేయించిన బ్రెడ్ క్రంబ్స్, ఇలాచీ  పొడి , 

వెనీలా ఎసెన్స్ వేసి బాగా కలపాలి.

ఇప్పుడు ఓవెన్ ను కన్వెక్షన్ మోడ్ లో 220 డిగ్రీల లో ప్రీహీట్

చేసుకోవాలి 

తయారు చేసుకున్న బ్రెడ్ మిశ్రమాన్ని కొంచెం నెయ్యి రాసుకున్న 

బేకింగ్ మౌల్డ్ లో వేసుకుని పైన  కాజూ, చెర్రీస్ వేసి ప్రీహీట్  చేసుకున్న 

ఓవెన్ లో పదిహేను నిమిషాలు బేక్ చేసుకోవాలి   

వేడిగా తిన్నా, ఫ్రిజ్ లో ఉంచి చల్లగా తిన్నా చాలా రుచిగా ఉంటుంది.











Share/Bookmark

4 comments:

ఇందు

లతగారూ! ఎగ్ లేకుండా పుడ్డింగ్ చేయలేమా? :(( నేను బ్రెడ్ వంటకం అనంగానే ఆశగా వచ్చా! కానీ ఎగ్ ఉంది. అది లేకుండా చేయడం కుదరదా?

లత

నేను ట్రై చేసి చూస్తాను ఇందు గారు, చేసి మీకు చెప్తాను

John Vincent Raj

it;s nice

ఇందు

Thnq Latha :)

Post a Comment

అభిరుచి   © 2008. Template Recipes by Emporium Digital

TOP