మసాలా పల్లీ - మైక్రోవేవ్ లో
మైక్రోవేవ్ లో చాలా ఈజీగా చేసుకోగల పని నట్స్ వేయించుకోవడం.
పల్లీలు, కాజూ, బాదం ఇలా ఏది అయిన నిమిషాల్లో వేగిపోతాయి.
అలాగే మసాలా పల్లీ కూడా అంత త్వరగానూ చెయ్యొచ్చు.
కావలసిన పదార్ధాలు:
పల్లీలు ఒక కప్
సెనగపిండి 3 స్పూన్లు
బియ్యంపిండి 1 స్పూను
ఉప్పు,కారం తగినంత
గరంమసాల పొడి చిటికెడు
వంటసోడా చిటికెడు
నూనె ఒక టీస్పూను
తయారు చేసే విధానం:
సెనగపిండి, బియ్యంపిండి, తగినంత ఉప్పు కారం, గరం మసాలా పొడి, వంటసోడా అన్నీ కొంచెం నీటితో పేస్టు లా కలుపుకోవాలి,
ఇందులో పల్లీలు వేసి మిశ్రమం అంతా వాటికి బాగా పట్టేలా మిక్స్ చెయ్యాలి
ఈ మిశ్రమాన్ని మైక్రోవేవ్ సేఫ్ బౌల్ లో వేసి ఒక స్పూన్ నూనె వేసి మళ్లీ కలిపి హై లో రెండు నిమిషాలు పెట్టాలి
ఒకసారి బయటికి తీసి బాగా కలిపి ఇంకో రెండు నిమిషాలు హై లో ఉంచాలి.
తరువాత ఒకసారి కలిపి టెంపరేచర్ తగ్గించి ఒక నిమిషం పెడితే పల్లీలు వేగిపోతాయి.
చల్లారాక బాగా క్రిస్ప్ గా అవుతాయి కాబట్టి మరీ బ్రౌన్ గా వేయించవద్దు.
2 comments:
CHALA BAGA VACHAYE
thankyou andi
Post a Comment