వెరైటీ బ్రెడ్ స్నాక్
సన్నగా చిరుజల్లులు పడుతుంటేనో, చలి గాలులు గిలిగింతలు
పెడుతుంటేనో, వేడివేడిగా ఏమైనా తినాలనిపిస్తుంది. ఎక్కువగా
పకోడీలు,మిర్చిబజ్జి ఇవే చేస్తుంటాము. బ్రెడ్, పకోడీ కాంబినేషన్ లో
చేసే ఈ స్నాక్ చాలా త్వరగా అయిపోతుంది. స్టవ్ పై నూనె వేడి
అయ్యేలోపు రెడీ చేసుకుని చేసేయవచ్చు.
కావలసిన పదార్ధాలు:
బ్రెడ్ 4 స్లైసులు
శనగపిండి ఒక కప్పు
వరిపిండి రెండు టేబుల్ స్పూన్లు
ఉల్లిపాయ ఒకటి
మిర్చి రెండు
అల్లం చిన్న ముక్క
కొత్తిమీర కొంచెం
కరివేపాకు నాలుగు ఆకులు
ఉప్పు తగినంత
వంటసోడా చిటికెడు
నూనె డీప్ ఫ్రై కి సరిపడా
టమాటాసాస్
తయారు చేసే విధానం:
బ్రెడ్ స్లైసెస్ ని రెండుగా కట్ చేసుకోవాలి.
ఉల్లిపాయని వాలికలుగా, మిర్చి,అల్లం,కరివేపాకు ,కొత్తిమీర వీటిని
సన్నగా తరగాలి.
సన్నగా తరగాలి.
శనగపిండి, వరిపిండి ఒక బౌల్ లో వేసి, తరిగినవి అన్నీ కలిపి ఉప్పు,
వంటసోడా వేసి కొంచెం నీటితో పకోడీ పిండిలా కలుపుకోవాలి.
వంటసోడా వేసి కొంచెం నీటితో పకోడీ పిండిలా కలుపుకోవాలి.
ఇప్పుడు కట్ చేసిన బ్రెడ్ స్లైస్ ని తీసుకుని దానికి ఒక వైపు ఈ పకోడీ
పిండిని అప్లై చేసుకోవాలి.
పిండిని అప్లై చేసుకోవాలి.
కాగిన నూనెలో ఈ స్లైసు ను పిండి ఉన్నవైపు నెమ్మదిగా వదిలి రెండు
వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా వేయించాలి.
వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా వేయించాలి.
క్రిస్ప్ గా ఉండే బ్రెడ్ ఒక వైపు, స్పైసీగా ఉండే పకోడీ ఒకవైపు ఉండే
వీటిని టొమాటో సాస్ తో వేడిగా తింటే చాలా రుచి గా ఉంటాయి.
4 comments:
వావ్...నేను బ్రెడ్ ఫాన్...చాలా థాంక్స్ ఇంత మంచి స్నాక్ చెప్పినందుకు :)
మీకు నచ్చినందుకు చాలా సంతోషం
థాంక్యూ ఇందూ,
thanks for varieties
welcome devi gaaru
Post a Comment