Tuesday, December 14, 2010

టేస్టీ ఫ్లేవర్డ్ రైస్




చాలా ఈజీగా, తొందరగా అయిపోయే మరో రైస్ ఐటం ఇది.ఎక్కువ 

మసాలాలు లేకుండా,ఒక వైపు పుదీనా ఫ్లేవర్,మరోవైపు కమ్మని పల్లీ, 

నువ్వుల ఫ్లేవర్ తో ఘుమమఘుమలాడే  ఈ వెరైటీ రైస్ చాలా రుచిగా 

ఉంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్ లో ఇవ్వడానికి కూడా చాలా 

బావుంటుంది.













కావలసిన పదార్ధాలు:

అన్నం                    రెండు కప్పులు

కారట్ తురుము         ఒక కప్పు

పుదీనా                  ఒక పెద్ద కట్ట 

ఉల్లిపాయ               ఒకటి

మిర్చి                    ఒకటి

కరివేపాకు               ఒక రెమ్మ

ఉప్పు,కారం             తగినంత

పసుపు                 చిటికెడు

గరంమసాలా పొడి     ఒక స్పూను

పల్లీలు                 రెండు టేబుల్ స్పూన్లు 

నువ్వులు             రెండు టేబుల్ స్పూన్లు

నూనె                  రెండు టేబుల్ స్పూన్లు

వేయించిన కాజూ     అలంకరణకి 



తయారు  చేసే  విధానం :

ముందుగా పల్లీలు,నువ్వులు కొంచెం వేయించుకుని పొడి చేసి 

పెట్టుకోవాలి.

నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లి, మిర్చి, కరివేపాకు వేసి కొంచెం 

వేయించాలి.

తరువాత కారట్ తురుము, సన్నగా తరిగిన  పుదీనా వేసి  తడి 

పోయేవరకూ బాగా వేయించాలి.

ఇప్పుడు ఉడికించిన అన్నం. ఉప్పు,కారం,పసుపు వేసి  కలపాలి.

చివరగా గరం మసాలా పొడి , పల్లీలు నువ్వుల పొడి వేసి  బాగా 

కలిపి సన్నని సెగపై రెండు  నిమిషాలు  వేయించి దింపెయ్యాలి.

వేయించిన కాజూ తో అలంకరించి వేడిగా సర్వ్ చెయ్యాలి.









Share/Bookmark

6 comments:

చెప్పాలంటే......

baane vundi oka saari chesi chustaanu

లత

చేసి చూడండి,మా ఇంట్లో ఇష్టం గానే తింటారు
థాంక్యూ

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు

లత గారూ, మొన్న ఆదివారం ఉదయం నేనూ, మా ఇద్దరు పిల్లలు కలిసి మా ఆవిడని వంటింట్లోకి రానివ్వకుండా లోగడ మీరు రాసిన సేమియా ఆమ్లెట్ చేసి పెట్టాము. చాలా బాగా వచ్చింది. థాంక్స్.

లత

మీకు నచ్చినందుకు చాల ఆనందంగా ఉంది క్రిష్ణ గారూ
థాంక్యూ

ఇందు

అర్రె! నేను ఇల్లంటిది చేసా! ఐతే జీడిపప్పులు,బాదం పప్పులు కూడా పొడి చేసా! హ్మ్! మీ ఈసీ వంటలు భలె ఉంటున్నాయ్!

లత

థాంక్స్ ఇందు గారూ
థాంక్యూ వెరీమచ్

Post a Comment

అభిరుచి   © 2008. Template Recipes by Emporium Digital

TOP