సేమ్యా సగ్గుబియ్యం పాయసం
పండుగలు అనగానే ముందు గుర్తొచ్చేది పాయసమే.ఎన్నో వెరైటీల
పాయసాలు ఉన్నా సేమ్యా సగ్గుబియ్యం వేసి చేసే ఈ పాయసం చాలా
ట్రెడిషనల్.ఇది ఆరోగ్యానికి కూడామంచిది.పుట్టినరోజు అంటే మాఇంట్లో
అయినా
కావలసిన పదార్ధాలు :
పాలు అర లీటరు
సగ్గుబియ్యం ఒక కప్పు
సేమ్యా ఒక కప్పు
నెయ్యి రెండు స్పూన్లు
బెల్లం ఒక కప్పు
పంచదార అర కప్పు
ఇలాచి పొడి ఒక స్పూన్
కాజూ,కిస్మిస్
తయారు చేసే విధానం
సగ్గుబియ్యం కడిగి కొంచెం నీరు పోసి నానబెట్టుకోవాలి
ఒక స్పూన్ నెయ్యి వేడి చేసి కాజూ,కిస్మిస్ వేయించి తీసుకోవాలి.ఇంకో
స్పూన్ నేతిలో సేమ్యా వేయించి తీసుకోవాలి
బెల్లం,పంచదార కొంచెం నీరుపోసి వేడిచేసి రెండూ పూర్తిగా కరిగి
బబుల్స్ వచ్చేవరకూ ఉడికించి వడపోసి ఉంచాలి
పాలు కాచి పొంగు వచ్చేటప్పుడు సగ్గుబియ్యం వేసి ఉడికించాలి.ఇవి
కొంచెం ఉడికాక వేయించిన సేమ్యావేసి ఉడికిన తరువాత ఇలాచిపొడి,
వేయించిన కాజూ,కిస్మిస్ వేసి స్టవ్ ఆఫ్ చెయ్యాలి.
చల్లారిన తరువాత బెల్లంపాకం కలిపితే కమ్మని పాయసం రెడీ
అవుతుంది.
నోట్: పాయసం వేడిగా ఉన్నప్పుడు పాకం కలిపితే పాలు విరిగినట్టు
అవుతుంది,అందుకని చల్లారిన తరువాత మాత్రమే కలపాలి.
12 comments:
@లత గారు
మీ వంటలన్నీ చదివాను చాలా బాగా రాస్తున్నారు నాకు అన్ని నచ్చేసాయి .
పాయసం చూస్తుంటే అబ్బా నోరు ఊరిపోతుంది. వీలుంటే కొంచెం కప్పులో వేసి ఇటు ఇవ్వండి ....
థాంక్యూవెరీమచ్ సుమలతగారూ
నా వంటలు మీకు నచ్చినందుకు చాలా ఆనందం కలిగింది.
మీరడిగితే కాదంటానా ఒక కప్పు పాయసం మీ బ్లాగ్ కి పార్సిల్ చేస్తున్నాను సరేనా
నిజంగా నోరూరించేలా ఉందండి. బెల్లం వేయటం ఇంతవరకు వినలేదు, ఇప్పుడు ట్రై చేస్తాను.
థాంక్యూ ప్రియగారూ
మొన్న మీ క్యాబేజీ పకోడీ కూర ట్రై చేసా! చాలా బాగా వచ్చింది! ఏంటో మీ దయవల్ల నేను వంటల్లో తెగ ఆరితేరిపోతున్నా ;) మా చందుగారు ఫోన్ చేసి మరీ వాళ్ళ అమ్మావాళ్ళకి చెబుతున్నారు....ఇందు బాగా చేసేస్తోంది వంతలు అని ;)నా స్పెషల్స్ లో చాలా వరకు మీ బ్లాగులో కాపీ కొట్టినవే ;) హ్మ్! రేపు ఈ సగ్గుబియ్యం,సేమ్య పాయసం సంగతి చూడాలి :) నన్ను ఇంత బాగా వంటల్లో సానపెట్టేస్తున్నదుకు మీకు బోలెడు థాంకూలు :)
ఈ మధ్య కనిపించటం లేదు ఎమిటా అనుకున్నాను
మీకు నచ్చినందుకు చాల సంతోషం ఇందూ
అన్నీ ట్రై చేస్తున్నందుకు మీకు కూడా బోలెడు థాంకూలు
మీరు బెల్లం, పంచదారలు ఆఖర్న కలుపుతారా...!
నీళ్ళలో సగ్గుబియ్యం, వేయించిన సేమ్యా బాగా ఉడికాక బెల్లం, పంచదారల్ని కలిపి అది చల్లారాక... మరిగించిన పాలని కలుపుతాము మేము.
ఈ సారి మీరు చెప్పినట్టు ట్రై చేసి చూస్తాను...
అవును గీతికగారూ,పాలలో ఉడికిస్తాము కదా.వేడిమీద బెల్లం కలిపితే విరుగుతాయి.అందుకని ఇలా చేస్తాము
లత గారూ..బెల్లం వెయ్యడం గురించి నాకు తెలియదండీ ఈ సారి ప్రయత్నిస్తాను.
చేసి చూడండి జ్యోతిర్మయిగారూ, బావుంటుంది
Marchipoyaa cheppadam.... monna aamadhya Ugadiki ide sweet chesa :) chala mechukunnaru andaru :)
Eesari Vinayakachavitiki mee vantallo desert edo okati cheseddamani decided :) chesaka cheptaanu meeku :)
అలాగే ఇందూ నచ్చినది చేసేసి ఎలా ఉన్నదీ చెప్పండి
Post a Comment