మామిడికాయ, కొబ్బరి పచ్చడి
పచ్చిమామిడి.ఆ పులుపు తలచుకుంటేనే నోరూరుతుంది.ఈ ఏడాది
తొలి మామిడికాయ.భలే పుల్లగా ఉంది.మామిడికాయతో ఎలా పచ్చడి
చేసినా ఇష్టమే.చేసీచేసీ నాకు విసుగురావాలే కానీ రోజూ చేసినా
తింటారు మా ఇంట్లో. అందుకే మొదటగా కొబ్బరితో కలిపి ఈ పచ్చడి
చేశాను.
తింటారు మా ఇంట్లో. అందుకే మొదటగా కొబ్బరితో కలిపి ఈ పచ్చడి
చేశాను.
కావలసిన పదార్ధాలు
మామిడికాయ ఒకటి
పచ్చికొబ్బరితురుము ఒక కప్పు
ఎండుమిర్చి పది
ఉప్పు తగినంత
జీలకర్ర ఒక స్పూన్
వెల్లుల్లి రెబ్బలు ఆరేడు
కరివేపాకు రెండు రెమ్మలు
నూనె మూడు టేబుల్ స్పూన్లు
తాలింపుకు
శనగపప్పు,మినప్పప్పు,ఆవాలు,ఎండుమిర్చి
తయారు చేసే విధానం:
ఒక స్పూన్ నూనె వేడిచేసి ఎండుమిర్చిని దోరగా వేయించుకోవాలి.
ఈ ఎండుమిర్చి,ఉప్పు,వెల్లుల్లిరెబ్బలు జీలకర్ర మిక్సీలో గ్రైండ్ చెయ్యాలి.
ఇప్పుడు సన్నగా తరిగిన మామిడికాయ ముక్కలు,కొబ్బరితురుము
వేసి అన్నీ కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
నూనె వేడిచేసి తాలింపు వేసి పచ్చడిలో కలిపితే పుల్లగా,కమ్మగా
పచ్చడి రెడీ అవుతుంది.
వేడివేడి అన్నం లో నెయ్యి వేసుకుని తింటే .... ఇక వదిలిపెట్టరు
3 comments:
నాకు కూడా చాలా ఇష్టం మామిడికాయ, కొబ్బరికాయ పచ్చడి :)
అబ్బ నోరూరుతుందండి !
అవును సౌమ్య గారు, మాకు కూడా
శ్రావ్య గారు
థాంక్యూ
Post a Comment