కాజూ బాదం కస్టర్డ్ ఖీర్
వేసవి వచ్చేసింది కదా చల్లచల్లగా తినాలనిపిస్తుంది.చాలా సింపుల్ గా
పదినిమిషాల్లో అయిపోయే ఖీర్ ఇది.డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కనుక
మంచిది.చేసి ఫ్రిజ్ లోఉంచుకుంటే పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు
ఇవ్వొచ్చు
ఇవ్వొచ్చు
కావలసిన పదార్ధాలు :
పాలు అర లీటరు
కాజూ పది
బాదం పది
పంచదార ఒక కప్పు
కస్టర్డ్ పౌడర్ ఒక టేబుల్ స్పూను
సన్న సేమ్యా అర కప్పు
నెయ్యి ఒక స్పూన్
ఇలాచీ పొడి అర స్పూన్
తయారు చేసే విధానం :
ముందుగా నెయ్యి వేడిచేసి సన్నసేమ్యాని వేయించి తీసుకోవాలి.ఇది
లేనివారు మామూలు సేమ్యా అయినా వెయ్యొచ్చు
కాజూ బాదం మిక్సీలో వేసి ఒక్కసారి తిప్పి తీసేయ్యాలి. మరీ పౌడర్ లా
కాకుండా పలుకుల్లా ఉంటేనే బాగుంటుంది.
పాలు పంచదార కలిపి మరిగించి,పంచదార కరిగాక సేమ్యా వేసి ఒక
పొంగురాగానే,ఒక స్పూన్ పాలల్లో కలిపిన కస్టర్డ్ పౌడర్ వెయ్యాలి.
ఒక నిమిషం తరువాత కాజూ,బాదం వేసి కొంచెం చిక్కబడేవరకు ఉంచి
ఇలాచీ పొడి వేసి దించెయ్యాలి
చల్లారాక ఫ్రిజ్ లో ఉంచి చల్లగా సర్వ్ చెయ్యాలి
ఇందులో ఇష్టం ఉన్నవారు ఖర్జూర పళ్ళు కూడా చిన్న ముక్కలుగా
కట్ చేసి వేసి ఇవ్వొచ్చు.
లేదా ఇచ్చేముందు గ్రేప్స్,దానిమ్మగింజలు ఇలాంటి ఫ్రెష్ ఫ్రూట్స్ కూడా
కలిపి ఇవ్వొచ్చు .
0 comments:
Post a Comment