సేమ్యా పులిహోర
పులిహోరను ఇష్టపడని వారు ఎవరూ ఉండరు.
నిమ్మకాయ,మామిడికాయ ఇలా ఎన్నిరకాలు ఉపయోగించి చేసినా
చింతపండు పులిహోర రుచేవేరు,అలాగే ఎప్పుడూ రైస్ తోనే కాకుండా
ఇలా సేమ్యాతో చేస్తే కూడా చాలా రుచిగా ఉంటుంది.పిల్లలకి బాక్స్ లో
పెట్టి ఇవ్వడానికి కూడా బావుంటుంది.చింతపండు పేస్టు రెడీగా ఉంటే
అయిదే అయిదు నిమిషాల్లో ఈజీగా చేసెయ్యొచ్చు
కావలసిన పదార్ధాలు :
సేమ్యా రెండు కప్పులు
చింతపండు పేస్టు రెండు టేబుల్ స్పూన్లు
ఉప్పు తగినంత
మిర్చి నాలుగు
అల్లం చిన్న ముక్క
కరివేపాకు రెండు రెమ్మలు
నూనె మూడు టేబుల్ స్పూన్లు
తాలింపుకు
శనగపప్పు,మినప్పప్పు,ఆవాలు,ఎండుమిర్చి,వేరుసెనగ గుళ్ళు
తయారు చేసే విధానం:
ముందుగా నీళ్ళు మరిగించి సేమ్యా ,కొంచెం ఉప్పు,అర స్పూను నూనె
వేసి ఉడికించాలి.
సేమ్యా ఉడకగానే జాలీలోవార్చి వెంటనే చల్లనినీళ్ళు పోయాలి.అప్పుడు
సేమ్యా పొడిపొడి గా ఉంటుంది
నూనె వేడి చేసి వేరుశనగ గుళ్ళు,శనగపప్పు,మినప్పప్పు,ఆవాలు
ఎండుమిర్చి వేసి తాలింపు వెయ్యాలి.
వేగాక కరివేపాకు,సన్నగా తరిగిన అల్లం ముక్కలు,వాలికలుగా కోసిన
మిర్చి వేసి దోరగా వేగాక కొంచెం పసుపు వెయ్యాలి.
స్టవ్ ఆఫ్ చేసి ఉడికించిన సేమ్యా ,చింతపండు పేస్ట్ ,తగినంత ఉప్పు
వేసి బాగా కలపాలి.
ఒక పావుగంట ఆగితే, ఊరి రుచిగా ఉంటుంది.
2 comments:
చూస్తే తినాలనిపిస్తోంది. అంత బాగుంది.
థాంక్స్ లక్ష్మి గారూ
Post a Comment