Sunday, January 16, 2011

సేమ్యా, రవ్వ ఇడ్లీ మైక్రోవేవ్ లో

తెల్లగా మల్లెపువ్వుల్లా,నోట్లో వేసుకుంటే దూదుల్లా కరిగిపోయే ఇడ్లీ,

చట్నీ,కారప్పొడి, నెయ్యి కాంబినేషన్ ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి 

వేడిగా పొగలు కక్కుతూ,ఊరించే ఆరోగ్యకరమైన టిఫిన్ ఇడ్లీ.కాకపోతే 

ముందురోజు పప్పు,రవ్వ నానబెట్టుకోడం,రుబ్బుకోడం ఇలాంటివి 

తప్పవు అనుకోండి.అంత కష్టపడకుండా యిన్ స్టంట్ గా చేసుకునే ఈ 

ఇడ్లీ కూడా చాలా బావుంటుంది.ట్రై చేసి చూడండి.

ఇవి మైక్రోవేవ్ లో చేసిన ఇడ్లీలు  












కావలసిన  పదార్ధాలు : 

బొంబాయి రవ్వ                       రెండు కప్పులు 

సేమ్యా                                 రెండు కప్పులు 

పెరుగు                                మూడు కప్పులు 

ఉల్లిపాయ                             ఒకటి 

మిర్చి                                  ఒకటి 

కారట్ తురుము                      ఒక కప్పు 

కొత్తిమీర                              కొంచెం 

ఉప్పు                                  తగినంత 

వంటసోడా                           పావు స్పూను

తాలింపుకు                            

శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు 

నూనె                                  ఒక టేబుల్ స్పూను 

తయారు చేసే విధానం:


ముందుగా బొంబాయి రవ్వను దోరగా వేయించుకుని ఒక బౌల్ లోకి 

తీసుకోవాలి.

ఒక స్పూన్ నూనెలో సేమ్యాను గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకుని 

రవ్వ లో వేయాలి.

ఇప్పుడు ఇందులో పెరుగు,తగినంత ఉప్పు, వంటసోడా వేసి బాగా కలిపి 

అరగంట సేపు నాననివ్వాలి.

ఒక స్పూన్ నూనె వేడి చేసి తాలింపు వేసి అందులో సన్నగా తరిగిన 

ఉల్లి,మిర్చి,కొత్తిమీర,కారట్ తురుము వేసి ఒక  నిమిషం వేయించి 

నానిన రవ్వ మిశ్రమం లో కలపాలి.ఇవి ఇష్టం లేనివారు కలపకుండా 

ప్లెయిన్ గా కూడా వేసుకోవచ్చు.

మిశ్రమం గట్టిగా ఐతే కొంచెం నీరు కలిపి ఇడ్లీ పిండిలా చేసుకోవాలి.

ఇప్పుడు ఈ పిండిని ఇడ్లీ ప్లేట్లలో వేసి పది నిమిషాలు ఉడికించాలి.

వేడి వేడిగా కొబ్బరి పచ్చడితో వడ్డిస్తే యిన్ స్టంట్  ఇడ్లీ సిద్దం.

మైక్రోవేవ్ లో వేయాలంటే 640 వాట్స్ లో 5 నిమిషాలు పెడితే ఇడ్లీలు 

రెడీ అవుతాయి.ఐతే తప్పనిసరిగా మూత  పెట్టి మాత్రమే ఓవెన్ లో 

ఉడికించాలి.























Share/Bookmark

9 comments:

G.P.V.Prasad

never ever use micro wave oven its radiations are heavy

ఇందు

Meeru bread batch.Idlee vaipu choodakoodadu :P

లత

ఎప్పుడైనా ఒకసారి చెయ్యాలి కద ఇందూ,
ఎప్పుడు బ్రెడ్ పెట్టినా తినేటప్పుడు,అప్పుడప్పడూ ఇడ్లి చెయ్యొచ్చులే.
బాచ్ మాత్రం మీ బాచే డోంట్ వర్రీ

సుజాత వేల్పూరి

అబ్బ, పప్పు నానబెట్టాక చూశాను మీ రెసిపీ! ఎల్లుండి చేస్తాలెండి, మా పాపకి నచ్చేట్లు ఉంది

లత

మా పాప కూడా ఇష్టంగా తింటుంది.చేసి చూడండి సుజాతగారూ,థాంక్యూ

మాలా కుమార్

ఈ రోజు ఈ ఇడ్లీలు ట్రై చేసానండి . మీ ఫొటోలో వున్నంత అందం గా రాలేదు . కాని పరవాలేదు బాగానే వచ్చాయి .
చట్నీస్ కు వెళ్ళగానే చిరంజీవి ఫేవరేట్ , స్టీం దోస అని ఇస్తాడు . మీకు తెలిస్తే ఈ సారి అది చెప్పండి .
తృష్ణ గారి వంటలు కూడా బాగుంటాయట . రేపు అటెళ్ళి మళ్ళీ వస్తాను మీ అభిరుచికి :)

లత

ట్రై చేసి ఎలా ఉన్నాయో చెప్తున్నారు
థాంక్యూ మాల గారూ

lakshmisravya

hi na peru lakshmisravya....nenu recent gas me blog chusanu and it is really awesome...........nenu first nundi vanti entlo kanisam pappulo enni varieties vunnayo kuda teledu......so nannu pelli chesukanna a hero gurinchi koncham alochinchadi.......me site chusaka nenu ma husband kadupuninda tintunamu ani chepataniki i m nt feeling shamed......thanku once again.......

లత

థాంక్యూ లక్ష్మిగారూ
నా బ్లాగ్ లోని వంటలు మీకు నచ్చినందుకూ,ఉపయోగపడుతున్నందుకూ చాలా సంతోషం

Post a Comment

అభిరుచి   © 2008. Template Recipes by Emporium Digital

TOP