ఈజీ బ్రెడ్ టోస్ట్
బ్రెడ్ తోఎన్నిరకాల టోస్ట్ లు అయినా నిమిషాల్లో చేసుకోవచ్చు.జనరల్
గా చేసే చీజ్ టోస్ట్ లు కాకుండా రవ్వ, కూరగాయల కాంబినేషన్ లో
ఈ టోస్ట్ వెరైటీ గా ఉంటుంది.ఈ మిశ్రమం రెండు మూడు రోజులు ఫ్రిజ్
లో స్టోర్ చేసుకోవచ్చు.
గా చేసే చీజ్ టోస్ట్ లు కాకుండా రవ్వ, కూరగాయల కాంబినేషన్ లో
ఈ టోస్ట్ వెరైటీ గా ఉంటుంది.ఈ మిశ్రమం రెండు మూడు రోజులు ఫ్రిజ్
లో స్టోర్ చేసుకోవచ్చు.
కావలసిన పదార్ధాలు:
బొంబాయిరవ్వ ఒక కప్పు
పెరుగు ఒక కప్పు
ఉల్లిపాయ ఒకటి
మిర్చి రెండు మూడు
కారట్ తురుము అర కప్పు
కాప్సికం ఒకటి
టమాటా ఒకటి
కొత్తిమీర అర కప్పు
అల్లం చిన్న ముక్క
ఉప్పు తగినంత
నూనె రెండు టేబుల్ స్పూన్లు
టమాటాసాస్
తయారు చేసే విధానం:
ముందుగా పెరుగు లో బొంబాయిరవ్వ వేసి కలిపి ఒక గంట సేపు
నాననివ్వాలి.
నాననివ్వాలి.
నానిన రవ్వలో సన్నగా తరిగిన ఉల్లి,మిర్చి.కాప్సికం, టమాటా,
కొత్తిమీర, పుదీనా,అల్లం వేయాలి.
కారట్ తురుము ,ఉప్పు కూడా వేసి బాగా కలపాలి.మిశ్రమం గట్టిగ
ఉంది అనుకుంటే కొంచెం నీళ్ళు కలపొచ్చు .
ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ తీసుకుని ఒకవైపు ఈ మిశ్రమాన్ని అప్లై చెయ్యాలి.
పేనం వేడి చేసి కొంచెం నూనె వేసి ముందు మిశ్రమం లేని వైపున
ఉంచి కొంచెం వేగాక మెల్లగా తిప్పి సన్నని సెగపై కాలనివ్వాలి.
గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసుకుని టమాటా సాస్ తో సర్వ్ చేస్తే
బావుంటుంది.
4 comments:
wow...idedo bhale easy gaa varietyga unde!! Thnq Thnq.Manchi manchi bread vantkalu vestunnaru :)
నేను ఎక్కువ ఇలాంటి సింపుల్ ఐటంసే చేస్తుంటాను రోజూ .
థాంక్స్ ఇందూ
Lathagaruu..nenu idi ninna chesanandi breakfast gaa. bread ante padani maa chandu ki chala nachindi :) bhale undi ani motham 4 slices tinesaru :)) mee chalave anthaa. cheppanu ilaa Lathagaru tana blog lo pettaru choosi chesa ani.Meku boledu thankuuluuuu :)
చందుగారికి నచ్చినందుకు చాలా సంతోషం ఇందూ
మీరు ఎలాగూ బ్రెడ్ బాచే కదా
Post a Comment