బ్రెడ్ దోశ
ఇంట్లో ఎప్పుడూ ఉండే బ్రెడ్ తో చేసుకునే ఈ దోశ పిల్లలకి వెరైటీగా
చేసేసుకోవచ్చు.
కావలసిన పదార్ధాలు:
బ్రెడ్ స్లైసెస్ ఆరు
బొంబాయిరవ్వ అర కప్పు
బియ్యంపిండి రెండు టేబుల్ స్పూన్స్
ఉల్లిపాయ ఒకటి
పచ్చిమిర్చి రెండు
కారట్ తురుము రెండు స్పూన్స్
అల్లం,కొత్తిమీర,కరివేపాకు,నూనె,ఉప్పు
తయారు చేసే విధానం:
బ్రెడ్ ను చిన్న ముక్కలు చేసి మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చెయ్యాలి.
ఇందులో రవ్వ,బియ్యంపిండి వేసి కొంచెం నీళ్ళుపోసి మెత్తగా గ్రైండ్
చేసుకోవాలి
ఈ మిశ్రమాన్ని ఒక బౌల్ లోకి తీసుకుని తగినంత ఉప్పు,నీళ్ళు పోసి
కలిపి దోసెల పిండిలా చేసుకుని ఒక అరగంట నాననివ్వాలి.
ఇందులో సన్నగా తరిగిన ఉల్లి,మిర్చి,అల్లం,కొత్తిమీర,కరివేపాకు,
కారట్ తురుము అన్నీ వేసి కలపాలి
నాన్ స్టిక్ తవా పైన ఈ మిశ్రమాన్ని చిన్నచిన్న దోసెలు పోసుకుని
నూనె వేసి రెండువైపులా కాల్చాలి.
వేడివేడిగా ఏదైనా చట్నీతో కానీ,సాస్ తో కానీ సర్వ్ చేస్తే బావుంటుంది.
5 comments:
భలే వెరైటీగా ఉందండీ ఇది :))
థాంక్యూ సౌమ్యా,ట్రై చేసి చూడండి
మేము ట్రై చేసాము. బాగా వచ్చింది. 8 వచ్చాయి. మా డిన్నర్ అవే. నేను ఇటాలియన్ బ్రెడ్ వాడాము. అర టీస్పూన్ సాల్ట్ మాకు సరిపోయింది. థాంక్స్ ఫర్ ది రెసిపి.
థాంక్యూ రాజుగారు
Idi try cheyaledandi :( roju bread chusinappudalla ide gurtostundi :( ee weekend cheseyali :)
Post a Comment