పనసతొనలు
చాలా ఫేమస్ స్వీట్ ఇది.సింపుల్ గా చేసుకోగల ఈ స్వీట్ పంచదార
పాకం పీల్చుకుని రెండు మూడు రోజులవరకూ జ్యూసీగా చాలా రుచిగా
ఉంటాయి.
కావలసిన పదార్ధాలు:
మైదాపిండి ఒకకప్పు
పంచదార ఒకకప్పు
వెన్నలేదా నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు
ఇలాచీపొడి అర టీ స్పూన్
నూనె
తయారు చేసే విధానం:
మైదాపిండిలో వెన్నకానీ,నెయ్యి కానీ వేసి బాగా కలుపుకోవాలి.
ఇప్పుడు కొంచెం నీళ్ళు చల్లుతూ పూరీపిండిలా మృదువుగా కలిపి ఒక
అరగంట నాననివ్వాలి.
పంచదారలో కొంచెం నీళ్ళు పోసి తీగపాకం పట్టుకోవాలి.ఇందులో ఇలాచీ
పొడి వేయాలి.
నానిన పిండిని చిన్నచిన్న ఉండలు చేసి పూరీలు చెయ్యాలి.వీటిని
చివరలు విడకుండా మధ్యలో కట్ చేసి రెండువైపుల నుండీ మడుస్తూ
వచ్చి చివరలు ప్రెస్ చేయాలి.
ఇలా చేసుకున్న పనసతొనలను కాగిన నూనెలో వేయించి పంచదార
పాకంలో వేయాలి.
రెండుమూడు నిమిషాల తరువాత తీసి ఒక ప్లేట్ లో ఉంచాలి.
చల్లారిన తరువాత స్టోర్ చేసుకోవాలి
0 comments:
Post a Comment