Thursday, September 22, 2011

చికెన్ తంగ్డి కబాబ్

కబాబ్స్ చాలా రుచిగా ఉంటాయి,వాటిని ఎంత ఇష్టపడినా ఇంట్లో 

చేయడం తక్కువే.మైక్రోవేవ్ తో పాటు వచ్చిన బుక్ లో రెసిపీ చూసి 

చేసిన ఈ చికెన్ కబాబ్ చాలా బాగా కుదిరింది.మారినేషన్ తయారు 

చేసుకుంటే చాలు సింపుల్ గా అయిపోతుంది.







కావలసిన పదార్ధాలు:


చికెన్ లెగ్స్                   రెండు 


ఫస్ట్ మారినేషన్ 


నిమ్మరసం                      ఒక టీ స్పూన్ 

నూనె                           ఒక టీ స్పూన్ 

ఉప్పు,కారం                      కొంచెం 


సెకండ్ మారినేషన్ కు 


పెరుగు                                 పావు కప్ 

నూనె                                 ఒక టీ స్పూన్

మీగడ                                రెండు టీ స్పూన్స్ 

కొత్తిమీర                             రెండు టీ స్పూన్స్ 

కసూరి మేతి                         ఒక టీ స్పూన్ 

కార్న్ ఫ్లోర్                            ఒక టీ స్పూన్ 

కాజూ పౌడర్                         ఒక టీ స్పూన్ 

ఉప్పు,కారం                          తగినంత 

గరంమసాలాపొడి                   ఒక టీ స్పూన్ 

అల్లంవెల్లుల్లి ముద్ద                 ఒక టేబుల్ స్పూన్ 


తయారు చేసే విధానం:


చికెన్ పీసెస్ కు రెండుమూడు చోట్ల చాకుతో చిన్నకట్స్ చెయ్యాలి.
నిమ్మరసం,నూనె,ఉప్పు,కారం ఒక బౌల్ లో వేసి కలిపి చికెన్ 
 పీసెస్ వేసి ఒక అరగంట నాననివ్వాలి.

మరొక బౌల్ లో సెకండ్ మారినేషన్ కు రాసినవాటిని వేసి బాగా కలిపి 

నిమ్మరసంలో ఉన్న చికెన్ పీసెస్ ను ఈ పెరుగు మిశ్రమంలో వేసి 

మరో అరగంట నాననివ్వాలి.మిగిలిన నిమ్మరసం వేయొద్దు.

ఎక్కువసేపు ఉంచినా ఇంకా బావుంటుంది.ఉదయాన్నేఇది రెడీ చేసేసి 

సాయంత్రం చేసుకోవాలంటే మాత్రం ఫ్రిజ్ లో ఉంచేస్తే సరిపోతుంది.

ఒక వెడల్పు గాజుడిష్ లో కొంచెం నూనె వేసి ఈ చికెన్ పీసెస్ ఉంచి 

మైక్రోవేవ్ కాంబినేషన్ మోడ్(మైక్రో480w +గ్రిల్) లో ఆరేడు 

నిముషాలు ఉంచాలి.

ఒకసారి తీసి చికెన్ పీసెస్ కు మిగిలిన మిశ్రమం పట్టించి రెండోవైపు 

ఉంచి మరొక నాలుగు నిముషాలు ఇదే మోడ్ లో ఉంచితే రుచికరమైన 

కబాబ్స్ రెడీ అవుతాయి.

ఓవెన్ లేకపోయినా నాన్ స్టిక్ పాన్లో సన్నని సెగపై చికెన్ ఉడికి బాగా 

వేగే వరకూ ఉంచి చేసుకోవచ్చు.


Share/Bookmark

0 comments:

Post a Comment

అభిరుచి   © 2008. Template Recipes by Emporium Digital

TOP