టమాటా - కొబ్బరి పులావ్
కొంచెం పచ్చికొబ్బరి ఫ్లేవర్,పుల్లపుల్లని టమాటా టేస్ట్ తో ఉండే ఈ
పులావ్ చేయడం చాల తేలిక.పదినిమిషాల్లో రెడీ అయిపోతుంది.
కావలసిన పదార్ధాలు:
బియ్యం రెండు కప్పులు
టమాటాలు రెండు
కొబ్బరితురుము అర కప్పు
ఉల్లిపాయ ఒకటి
మిర్చి రెండు
పసుపు కొంచెం
ఉప్పు,నూనె తగినంత
కొత్తిమీర ఒక కట్ట
కరివేపాకు ఒక రెమ్మ
అల్లంవెల్లుల్లి పేస్ట్ రెండు టీస్పూన్స్
గరంమసాలా పొడి రెండు టీస్పూన్స్
రెండు లవంగాలు,చెక్క,యాలకులు,బిర్యానీ ఆకు
తయారు చేసే పధ్ధతి ;
బియ్యం కడిగి నానబెట్టుకోవాలి.
టమాటాలు ముక్కలు కోసి పచ్చికొబ్బరితో కలిపి మెత్తగా గ్రైండ్
చేసుకోవాలి.
నూనె వేడిచేసి మసాలాదినుసులు వేగాక సన్నగా తరిగిన ఉల్లి,మిర్చి
వేసి వేయించాలి.
అల్లంవెల్లుల్లి ముద్ద వేసి వేగిన తరువాత కరివేపాకు,టమాటా పేస్ట్ వేసి
ఉడికించాలి.
ఇప్పుడు పసుపు,గరంమసాలా పొడి కొత్తిమీర వేసి కొంచెం వేయించి
నీళ్ళు పోసి తగినంత ఉప్పు వేయాలి.
చివరగా నానబెట్టిన బియ్యం వేసి కలిపి పాన్ మూత పెట్టి మూడు
విజిల్స్ రానివ్వాలి.
ఒకసారి కలిపి వేడిగా సర్వ్ చేస్తే టమాటాపులావ్ నోరూరిస్తుంది.
1 comments:
Idedo Spanish rice laga undandi :) pic chala tempting ga undi :)
Post a Comment