మేథీ మటర్ మలై
పూరీ,చపాతీ,రోటీ వీటిలోకి వెరైటీ కర్రీస్ బావుంటాయి.ఎప్పుడూ చేసే
మిక్స్డ్ వెజిటబుల్ కూర బదులు ఇలాంటివి చేస్తే రెస్టారెంట్ లో తిన్న
ఫీల్ వచ్చేస్తుంది.మెంతికూర,బటానీల ఫ్లేవర్స్ తో ఈ కర్రీ చాలా రుచిగా
ఉంటుంది.
మిక్స్డ్ వెజిటబుల్ కూర బదులు ఇలాంటివి చేస్తే రెస్టారెంట్ లో తిన్న
ఫీల్ వచ్చేస్తుంది.మెంతికూర,బటానీల ఫ్లేవర్స్ తో ఈ కర్రీ చాలా రుచిగా
ఉంటుంది.
కావలసిన పదార్ధాలు:
మెంతికూర మూడు కట్టలు
పచ్చి బటానీలు ఒక కప్పు
ఉల్లిపాయ ఒకటి
పచ్చిమిర్చి ఒకటి
అల్లంవెల్లుల్లి పేస్ట్ ఒక టీస్పూన్
గరం మసాల పొడి అర టీస్పూన్
పసుపు చిటికెడు
కారం పావు స్పూన్
ఉప్పు తగినంత
నూనె రెండు టీ స్పూన్స్
మీగడ రెండు టేబుల్ స్పూన్స్
జీడిపప్పు పొడి ఒక స్పూన్
గసగసాలు పొడి ఒక స్పూన్
రెండు లవంగాలు,ఒక ఇలాచీ,చిన్న దాల్చినచెక్క,జీలకర్ర
తయారు చేసే విధానం:
బటానీలు ఉడికించుకోవాలి.
ఉల్లిపాయముక్కలు,మిర్చి ఉడికించి పేస్ట్ చేసుకోవాలి.
నూనె వేడిచేసి జీలకర్ర,లవంగాలు,చెక్క,ఇలాచీ వేసి ఉల్లిపాయ పేస్ట్
వేయించాలి.
ఇప్పుడు అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేగిన తరువాత మెంతికూర,ఉడికించిన
బటానీలు వేయాలి.
పసుపు,కారం,కాజూ గసగసాల పొడి వేసి బాగాకలిపి కొంచెం నీరు పోసి
ఉడికించాలి.తగినంత ఉప్పు,గరంమసాల పొడి వేసి కలపాలి
కూర చిక్కబడుతుండగా మీగడ వేసి కలిపి రెండు నిముషాలు ఉంచి,
వేడిగా చపాతీతో వడ్డిస్తే బావుంటుంది
2 comments:
Idi chapatillokenaaa lekapothe biryani,pulav loki raita laga koodaa tinocha!?
బిర్యానీ,పులావ్ లోకి కూడా తినొచ్చు ఇందూ
Post a Comment