వంకాయ - బటానీ కూర
వంకాయతో చాలా రకాల కూరలు చెయ్యొచ్చు.ఈ సీజన్లో బాగా దొరికే
బటానీలు కలిపి చేస్తే కూడా బావుంటుంది.అయితే సన్నగా పొడవుగా
ఉండే వంకాయలు వాడితే మంచిది.
కావలసిన పదార్ధాలు:
వంకాయలు పావుకిలో
బటానీలు అర కప్పు
ఉల్లిపాయ ఒకటి
పచ్చిమిర్చి నాలుగు
అల్లం చిన్నముక్క
కరివేపాకు ఒక రెమ్మ
మసాలాపొడి అర స్పూన్
ఉప్పు,కారం,పసుపు,నూనె,కొత్తిమీర
తాలింపుకు శనగపప్పు,ఆవాలు,జీలకర్ర,ఎండుమిర్చి
తయారు చేసే విధానం:
నూనె వేడిచేసి తాలింపు వేసుకోవాలి.
కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి వేయించాలి.
ఇప్పుడు అల్లం,మిర్చి,కొత్తిమీర కలిపి నూరిన పేస్ట్ వేసి వేగనివ్వాలి.
సన్నగా కోసిన వంకాయ ముక్కలు,చిటికెడు పసుపు వేసి కలిపి
మగ్గనివ్వాలి.
వంకాయ ముక్కలు వేగిన తరువాత,తగినంత ఉప్పు,కారం వేసి కలిపి
ఉడికించిన బటానీలు కూడా వేసి వేయించాలి.
చివరగా గరంమసాలాపొడి చల్లి రెండు నిముషాలు ఉంచి దింపెయ్యాలి.
2 comments:
బాగుంది సింపుల్ గా . ట్రై చేస్తాను .
నాకు చాలా ఇష్టమైన కూర వంకాయ. సో చదువుతుంటేనే నోరూరిపోతోంది.
Post a Comment