ఫ్రూట్ రబ్డి
పాలను బాగా మరిగించి అన్నిరకాల ఫ్రూట్స్ కలిపి సర్వ్ చేసే ఈ రబ్డి
చాలా రుచిగా ఉంటుంది.పిల్లలకు బాగా నచ్చుతుంది.
కావలసిన పదార్ధాలు :
చిక్కని పాలు అరలీటరు
పంచదార అర కప్పు
ఇలాచీ పొడి అర స్పూన్
బాదంమిక్స్ అర స్పూన్
యాపిల్,మామిడి,ద్రాక్ష,అరటి,పైన్ యాపిల్.దానిమ్మగింజలు ఇలా
ఏవైనా ఒక కప్పు పళ్ళముక్కలు
తయారు చేసే విధానం:
నాన్ స్టిక్ పాన్ లో పాలు పోసి బాగా మరిగించాలి.అరలీటరు పాలు
పావులీటరు అయ్యాక పంచదార కలిపి ,అది కరిగి మిశ్రమం కొంచెం
చిక్కగా అయ్యాక బాదం పౌడర్ ,ఇలాచీపొడి వేసి స్టవ్ ఆఫ్ చెయ్యాలి.
చల్లారాక ఫ్రిజ్ లో ఉంచి సర్వ్ చేసేప్పుడు సన్నగా కోసిన అన్నిరకాల
పళ్ళు కలపాలి.
పళ్ళు వద్దు అనుకుంటే కాజూ,బాదం,ఖర్జూరాలు,కిస్మిస్ ఇలా డ్రైఫ్రూట్స్
అన్నీ కలపొచ్చు.
వీటితోపాటు చిట్టిచిట్టి గులాబ్ జామూన్స్ కానీ,రసగుల్లాలు కానీ
వేసినా బావుంటుంది
4 comments:
బలె నోరు ఊరిస్తున్నాయి.అంతా తినాలనిపిస్తుంది.
థాంక్స్ శశిగారు
Wow...........bhale undi :) choostuntene tineyalanipistundi :)
థాంక్స్ ఇందూ
Post a Comment