వెజ్ పులావ్
సింపుల్ గా అయిపోయే రైస్ ఐటం అంటే వెజిటబుల్ పులావ్ అనే
చెప్పాలి.అన్నిరకాల కూరలూ వేసేసి పదినిమిషాల్లో చేసెయ్యొచ్చు.
దీనిలోకి జతగా పెరుగుపచ్చడి చేసేస్తే సరిపోతుంది.
కావలసిన పదార్ధాలు:
బియ్యం ఒక గ్లాస్
మిక్స్డ్ వెజిటబుల్స్ ఒక కప్పు
టమాటాలు రెండు
టమాటాలు రెండు
అల్లంవెల్లుల్లి ముద్ద రెండు టీ స్పూన్స్
గరంమసాలా పొడి రెండు స్పూన్స్
పుదీనా,కొత్తిమీర అర కప్పు
నూనె,ఉప్పు తగినంత
పసుపు కొద్దిగా
కారం అరస్పూన్
పెరుగు రెండు టేబుల్ స్పూన్స్
లవంగాలు,చెక్క,యాలకులు,షాజీర,బిర్యాని ఆకు,
అనాస పువ్వు,జాపత్రి
తయారు చేసే పధ్ధతి:
బియ్యం కడిగి నానబెట్టుకోవాలి
నూనె వేడిచేసి మసాలాదినుసులు అన్నీ వేయాలి.దోరగా వేగాక
వాలికలుగా తరిగిన ఉల్లి,మిర్చి వేసి వేయించాలి.ఇప్పుడు అల్లంవెల్లుల్లి
ముద్ద వేసి వేగిన తరువాత సన్నగా తరిగిన కూరగాయలు,బటానీలు,
స్వీట్ కార్న్ అన్నీవేసి కొంచెం వేయించాలి.
చివరగా టమాటాముక్కలు, పెరుగు వేసి బాగా ఉడికించాలి.పసుపు,
కారం,గరంమసాలాపొడి,పుదినా,కొత్తిమీర వేసి బాగా కలిపి నీళ్ళు పోసి
తగినంత ఉప్పు కూడా వేయాలి.
నీరు మరిగాక నానబెట్టిన బియ్యం వేసి కలిపి మూతపెట్టి మూడు
విజిల్స్ రానివ్వాలి.
ఇందులో ఆలూ,కారట్,పచ్చిబటానీ,కాప్సికం,స్వీట్ కార్న్,బీన్స్ ఇలా
అన్నిరకాలూ వాడొచ్చు.
3 comments:
హ్హహ్హహా! నవ్వింది మీ టపా చూసి కాదు....మా చందు ఎప్పుడూ ఘజనీ దండయాత్రలాగా నామీద చేసే వెజ్ పులావ్ దండయాత్ర గుర్తొచ్చి :) మీరింత సింపుల్గా చెప్పేసారా? మా చందుగారేమో....ఏంటో తెగ హడావిడి పడిపోయి వాళ్ళ అమ్మగారు చేసినట్టు అచ్చు అలాగే చేయాలని ఆరాటపడిపోయి అంతా రసాభా చేసేస్తారు :))
బాగుందండీ మీ కలర్ ఫుల్ పులావ్ :)
బలె..బలె గుర్తు చెస్తుంటారు.ఇంక యెమి చెయాలా అని ఆలొచిన్చటమ్
మాని మీరు రాసినవి చెసెస్తా
NICE VEG PALAV
Post a Comment