ఆలూ గోబీ ఫ్రై
కాలీఫ్లవర్ సీజన్ మొదలైంది.దీన్ని టమాటా,బటానీ,ఎగ్స్ ఇలా దేనితో
వండినా ఇష్టంగా తినొచ్చు.ఆలూతో కలిపి చేసే ఈ వేపుడు అన్నంలోకి,
చపాతీలోకి బావుంటుంది.
కావలసిన పదార్ధాలు:
కాలీఫ్లవర్ ఒకటి చిన్నది
ఆలూ రెండు
ఉల్లిపాయ ఒకటి
పచ్చిమిర్చి రెండు
కరివేపాకు ఒక రెమ్మ
కొత్తిమీర ఒక కట్ట
అల్లం చిన్న ముక్క
వెల్లుల్లి నాలుగు రెబ్బలు
గరంమసాలా పొడి అర టీస్పూన్
ఉప్పు,కారం,పసుపు,నూనె ,తాలింపు దినుసులు
తయారు చేసేవిధానం:
కాలీఫ్లవర్ ను చిన్నపువ్వులుగా విడదీసి ఆలూ ముక్కలతో కలిపి
కొంచెం ఉడికించి వార్చాలి.
నూనె వేడిచేసి తాలింపు వేసి సన్నగా తరిగిన ఉల్లిముక్కలు,కరివేపాకు
వేసి వాయించాలి.
అల్లం,మిర్చి,వెల్లుల్లి కలిపి గ్రైండ్ చేసుకుని ఈ పేస్ట్ వేసి వేయించాలి.
ఇప్పుడు ఉడికించిన ఆలూ,గోబీ వేసి కలపాలి.
తగినంత ఉప్పు,కారం,పసుపు వేసి ముక్కలు పూర్తిగా ఉడికేదాక
వేయించాలి.
చివరగా గరంమసాలా పొడి,కొత్తిమీర వేసి కలపాలి.
2 comments:
ఈ మధ్య నేను కొత్తగా ఏమి వంట చేయాలన్న మీ బ్లాగ్లో ఒక లుక్ వేసి చేసేస్తున్న.సింపుల్గా చక్కగా చెప్తారు.
థాంక్యూ శైలుగారు,
Post a Comment