Friday, November 11, 2011

డేట్స్ - ఆల్మండ్ ఖీర్

బాదం,ఖర్జూరాలు కలిపి చేసే ఈ ఖీర్ చాలా హెల్దీ ఐటం.అస్సలు నెయ్యి 

వాడము కనుక కాలరీస్ భయం కూడా ఉండదు.బ్లాగ్ వనభోజనాలకు

రాసిన ఈ ఖీర్ ను ఇందులో రీపోస్ట్ చేస్తున్నాను. 









కావలసిన పదార్ధాలు : 


చిక్కని పాలు                       పావు లీటరు 

ఖర్జూరాలు                          పది 

బాదంపప్పు                         పది 

ఇలాచీ పొడి                        అర స్పూను 

మిల్క్ మెయిడ్                   రెండు టేబుల్ స్పూన్స్  



తయారు చేసే విధానం :


ముందుగా బాదంపప్పును వేడినీళ్ళల్లో నానబెట్టి పొట్టు తీసుకోవాలి.

ఖర్జూరాలు గింజలు తీసేసి కొంచెం నీటిలో ఉడికించాలి.

ఈ రెంటినీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.అవసరమైతే కొంచెం పాలు 

వాడొచ్చు.

ఇప్పుడు పాలను కొంచెం మరిగించి బాదం ఖర్జూర మిశ్రమం వేసి 

ఉడికించాలి.

చివరగా మిల్క్ మెయిడ్ వేసి కలపాలి.ఇది లేకపోతే తగినంత 

పంచదార వేసుకోవచ్చు.

ఇలాచీపొడి వేసి కొద్దిగా చిక్కబడ్డాక స్టవ్ ఆఫ్ చెయ్యాలి.చల్లారాక ఇంకా 

చిక్కగా అవుతుంది 

సన్నగా తరిగిన బాదం,ఖర్జూరాలతో అలంకరించుకోవాలి. 

కాసేపు ఫ్రిజ్ లో ఉంచి తింటే బావుంటుంది.ఇష్టం ఉంటే చివరలో రెండు 

స్పూన్స్ నెయ్యి వేసుకోవచ్చు.



Share/Bookmark

2 comments:

Unknown

లతా గారు సూపర్ అండీ.కొంచం పేస్ బుక్ షేరింగ్ కూడా పెట్టుకోండి.పేస్ బుక్ లో ఉన్న నా నేస్తాలు కూడా చదివేస్తారు.

లత

తప్పకుండా శైలుగారూ,మంచి ఐడియా.అలాగే చేస్తాను.

Post a Comment

అభిరుచి   © 2008. Template Recipes by Emporium Digital

TOP