కారట్ - కోకోనట్ ఖీర్
పాలు తాగమన్నా,కారట్ తినమన్నా వినని పిల్లలకి బెస్ట్ ఆప్షన్ ఈ
ఖీర్.కొబ్బరితురుము వేయడంతో కొంచెం క్రంచీగా బావుంటుంది.
కావలసిన పదార్ధాలు :
కారట్ మూడు
పాలు అరలీటరు
పంచదార ఒక కప్ప
ఇలాచీ పొడి పావు స్పూన్
ఇలాచీ పొడి పావు స్పూన్
బాదం
తయారు చేసే విధానం:
కారట్ ఉడికించి పేస్ట్ చేసుకోవాలి.
పాలు కాగాక పంచదార వేసి మరిగించాలి.ఇందులో పచ్చికొబ్బరి
తురుము వేసి కొంచెం ఉడికించాలి.
ఇప్పుడు కారట్ పేస్ట్ వేసి కలిపి సన్నని మంటపై కొంచెం చిక్కబడ్డాక
ఇలాచీపొడి వేయాలి.
ఇలాచీపొడి వేయాలి.
ఫ్రిజ్ లో ఉంచి సర్వ్ చేసే ముందు కొంచెం కొబ్బరితురుము,సన్నగా
తురిమిన బాదం వేసి ఇస్తే చాలా రుచిగా ఉంటుంది.
తురిమిన బాదం వేసి ఇస్తే చాలా రుచిగా ఉంటుంది.
2 comments:
క్యారెట్ వేస్తే పాలు విరిగిపోతున్నాయ్ నాకు....మరి ఎలా????? :(
ఎందుకని ఇందూ,
కారట్ హల్వా,ఖీర్ ఇలా ఏది చేసినా పాలల్లోనే ఉడికిస్తాము కదా,
ఎప్పుడూ ఈ ప్రాబ్లం రాలేదు మరి
Post a Comment