బూందీ మిఠాయి
బెల్లం,కొంచెం పంచదార కలిపి చేసే అచ్చుమిఠాయి ఇది.పంచదార
లడ్డూలా మెత్తగా కాకుండా కరకరలాడుతూ ఉంటుంది.చెయ్యగలిగితే
వేడిమీద లడ్డూలు కూడా చుట్టుకోవచ్చు.
కావలసిన పదార్ధాలు:
శనగపిండి రెండు గ్లాసులు
బియ్యంపిండి ఒక గ్లాసు
బెల్లం రెండు గ్లాసులు
పంచదార ఒక గ్లాసు
యాలకుల పొడి ఒక టీ స్పూన్
నూనె
తయారు చేసే విధానం:
శనగపిండి,బియ్యంపిండి తగినన్ని నీళ్ళతో కొంచెం జారుగా
కలుపుకోవాలి.
కలుపుకోవాలి.
ఈ పిండిని బూందీ గరిటలో వేసి కాగిన నూనెలో బూందీ దూసుకోవాలి.
వేగిన తరువాత తీసి జల్లెడలో వేసుకోవాలి.ఇలా బూందీ అంతా రెడీ
చేసుకోవాలి
బెల్లం,పంచదార కొంచెం నీళ్ళు పోసి కరిగించి వడపోయాలి.
ఇప్పుడు తిరిగి స్టవ్ పైన ఉంచి బాగా ఉండపాకం పట్టుకోవాలి.ఇందులో
యాలకులపొడి,బూందీ వేసి బాగా కలిపి పళ్ళెంలో అచ్చు పోసెయ్యాలి.
యాలకులపొడి,బూందీ వేసి బాగా కలిపి పళ్ళెంలో అచ్చు పోసెయ్యాలి.
కాసేపగితే అచ్చు వచ్చేస్తుంది.చిన్నచిన్నముక్కలు చేసి స్టోర్
చేసుకోవాలి.
5 comments:
what a co-incidence? ఇప్పుడే బూంది మిఠాయి తింటూ మీకు వ్యాఖ్య పెడుతున్నాను (బజారులో కొన్నదిలెండి)so....sweet:)
ఓ....రియల్లీ స్వీట్ పద్మగారూ
idi naaku baagaa ishTamaina sweet!
బూంది మిఠాయి చెయ్యాలనుకుంటున్నాను, మీ టపా కనిపించింది. మీలా చెయ్యగలనో లేదో? చూడాలి.
మాకు కూడా ఇష్టమే సునీతగారూ
జ్యోతిర్మయిగారూ,ఈసరికి మీరు మిఠాయి చేసేసి ఉంటారు కదా
Post a Comment