అటుకుల దోశ
దోశలు ఎవరికైనా ఫేవరేట్ ఐటెం.అందులోనూ బోలెడు వెరైటీలు.
మామూలు దోశలు బోర్ కొట్టినప్పుడు ఈ అటుకుల దోశ చేసుకోవచ్చు.
కొంచెం మందంగా పొంగి స్పాంజ్ లా మెత్తగా ఉంటుంది.వేడివేడిగా
కొబ్బరిపచ్చడితో తింటే చాలా రుచిగా ఉంటుంది.
కావలసిన పదార్ధాలు:
బియ్యం మూడు కప్పులు
అటుకులు ఒక కప్పు
మినప్పప్పు అర కప్పు
సగ్గుబియ్యం రెండు టీ స్పూన్లు
ఉప్పు తగినంత
నూనె
తయారు చేసే విధానం :
బియ్యం,మినప్పప్పు,సగ్గుబియ్యం కలిపి కడిగి నాలుగైదు గంటలు
నానబెట్టాలి
అటుకులు కడిగి ఒక గంట నాననివ్వాలి.
అన్నీ కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మరునాడు ఉదయం తగినంత
ఉప్పు కలిపి చిన్నచిన్న దోసెలు వేసుకోవాలి.
పేనంపై వేశాక కొంచెం స్ప్రెడ్ చేసి ఉంచేస్తే చక్కగా పొంగుతుంది.మరీ
పలుచగా చేయొద్దు
పలుచగా చేయొద్దు
కొంచెం నూనె వేసి రెండువైపులా కాలనిచ్చి చట్నీతో సర్వ్ చెయ్యడమే.
2 comments:
ఇప్పుడే అనుకుంటున్నా.. అటుకులు కలుపుతారట దోశల పిండి లో నిష్పత్తి ఏంటో తెలుసుకోవాలి... అని.
ట్రై చేస్తా..
అవును క్రిష్ణప్రియ గారు
మామూలు దోసెల్లో కూడ నేను అటుకులు వేస్తాను.
ఒక గ్లాస్ మినప్పప్పు,రెండున్నర గ్లాసులు బియ్యం, ఒక కప్పు అటుకులు.
ఇది నేను వేసే కొలత
ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చాయో
కొందరు బియ్యం మూడు గ్లాసులు కూడా వేస్తారు
Post a Comment