Thursday, July 7, 2011

చికెన్ మసాలా రైస్

చికెన్ తో రైస్ అంటే ఫ్రైడ్ రైస్ ఎక్కువ చేస్తుంటాము.దీన్నే చైనీస్ 

పద్ధతిలో కాకుండా చేసుకోవచ్చు.చికెన్,ఎగ్స్ ,పుదీనా,కొత్తిమీర అన్నీ 

ఉండడంతో స్పైసీ ఫ్లేవర్స్ తో అందరూ చాలా ఇష్టపడతారు.చల్లచల్లగా 

ఉండే ఈ వెదర్ లో  వేడివేడిగా ఈ రైస్ చాలా రుచిగా ఉంటుంది. ఇది 

ఇండియన్ ఫ్రైడ్ రైస్ అన్నమాట.








కావలసిన పదార్ధాలు:


చికెన్                                  ఒక కప్పు 

ఎగ్స్                                   రెండు 

అన్నం                                రెండు కప్పులు 

పుదీనా                               పావుకప్పు 

కొత్తిమీర                              పావు కప్పు

ఉల్లిపాయ                             ఒకటి 

పచ్చిమిర్చి                           రెండు 

టమాటా                               ఒకటి

కరివేపాకు                            ఒక రెమ్మ 

ఉప్పు,కారం                           తగినంత

పసుపు                               కొంచెం 

నూనె                                రెండు టేబుల్ స్పూన్స్ 

అల్లంవెల్లుల్లి పేస్ట్                     ఒక టీ స్పూన్ 

గరం మసాలా పొడి                  ఒక టీ స్పూన్

తాలింపుకు  రెండు లవంగాలు,చిన్న దాల్చినచెక్క ముక్క,షాజీర  


తయారు చేసే విధానం:


చికెన్ ను చిటికెడు,ఉప్పు,కారం,వేసి ఉడికించి బోన్స్ తీసేసి సన్నగా 

కోసి ఉంచుకోవాలి.

ఒక టీస్పూన్ నూనె వేడిచేసి అందులో ఎగ్స్ బ్రేక్ చేసి పొడిపొడిగా 

ఉడికించి తీసుకోవాలి.

నూనె వేడిచేసి లవంగాలు,చెక్క,షాజీర వేసి సన్నగా తరిగిన ఉల్లి,మిర్చి 

వేసి దోరగా వేయించాలి.

ఇప్పుడు కరివేపాకు, తరిగిన టమాటాముక్కలు వేయాలి. టమాటా 

మగ్గిన తరువాత సన్నగా తరిగిన పుదీనా,కొత్తిమీర వేసి వేయించాలి.

ఇప్పుడు అల్లంవెల్లుల్లి ముద్ద వేసి వేగాక ఉడికించిన చికెన్ ముక్కలు,

ఎగ్స్ వేసి కారం,పసుపు వేసి కలిపి రెండు నిముషాలు వేయించాలి.

చివరగా అన్నం,తగినంత ఉప్పు,గరంమసాలాపొడి వేసి సన్నని సెగపై 

అంతా బాగా కలిసేలా కలుపుతూ వేయించాలి.

కొంచెం కొత్తిమీర చల్లి వేడిగా వడ్డిస్తే చికెన్ మసాలా రైస్ నోరూరిస్తుంది.

ఇష్టం ఉంటే ఇంకా ఇందులో ఉడికించిన ప్రాన్స్,కీమా లేదా మటన్ వేసి 

మిక్స్ డ్ రైస్ కూడా చేసుకోవచ్చు.

 


Share/Bookmark

2 comments:

Rajendra Devarapalli

ఇలా కప్పుల లెక్కన కాదు కానండీ పావు కిలో బియ్యానికి ఎంత చికెన్ ఆ లెక్కలో చెప్పండి,అర్జంట్

లత

ఇంతే లెక్క అని ఏమీ లేదు రాజేంద్రగారూ.మన ఇష్టం
చికెన్,ఎగ్స్ లిమిట్ ఏముంటుందండీ, పావుకిలో చికెన్,నాలుగు ఎగ్స్ వేసినా బాగానే ఉంటుంది.అయితే మిగిలినవి అన్నీ కూడా తగినట్టు పెంచి వేయండి అప్పుడే స్పైసీగా బావుంటుంది.

Post a Comment

అభిరుచి   © 2008. Template Recipes by Emporium Digital

TOP