పల్లీ - ఓట్స్ లడ్డు
లడ్డూలలో ఎన్నో వెరైటీలు.స్వీట్ ఇష్టంగా తినే ఎవరికైనా లడ్డూ ఫేవరేట్
ఐటం.ఇప్పుడు అంతా ఆరోగ్యరీత్యా నెయ్యి,పంచదార ఇలాంటివాటికి
దూరం కనుక వెరైటీగా పల్లీలు,ఓట్స్ కలిపి చేసే ఈలడ్డూలు హాపీగా
తినొచ్చు.చేయడం కూడా చాలా తేలిక.
కావలసిన పదార్ధాలు :
పల్లీలు ఒక కప్పు
ఓట్స్ ఒక కప్పు
బెల్లం ఒకటిన్నర కప్పు
నెయ్యి రెండు మూడు స్పూన్లు
ఇలాచీ పొడి ఒక స్పూన్
తయారు చేసే విధానం:
పల్లీలు వేయించి పొట్టు తీసుకోవాలి.
ఒక స్పూన్ నెయ్యి వేడిచేసి ఓట్స్ ను దోరగా వేయించుకోవాలి.
చల్లారిన తరువాత ఈ రెండూ మెత్తగా గ్రైండ్ చేయాలి.
ఇందులో సన్నగా తరిగిన బెల్లం,ఇలాచి పొడి వేసి గ్రైండ్ చెయ్యాలి.
ఒక బౌల్ లోకి తీసుకుని కరిగిన నెయ్యి రెండు స్పూన్స్ వేసి కలిపి
లడ్డూలు చేసుకోవాలి.
నెయ్యివద్దు అనుకుంటే ఒక స్పూన్ పాలు అయినా వాడొచ్చు.పాలు
వాడితే చాలా కొంచెం వేయాలి.ఎక్కువైతే పలుచగా అయ్యి లడ్డూ రాదు.
2 comments:
ఇది చేసి చూశానండి. చాలా బాగుంది.
నీ కామెంట్ ఇప్పుడే చూశాను శిశిరా.థాంక్యూ
Post a Comment