Tuesday, July 19, 2011

మొక్కజొన్న వడలు

వర్షాలతో పాటే మొక్కజొన్న పొత్తులు వచ్చేస్తాయి.వీటితో చాలా 

వెరైటీలు చేసుకోవచ్చు.చల్లని వర్షపు సాయంత్రాలకు ఈ మొక్కజొన్న 

వడలు మంచి కాంబినేషన్.చాలా సింపుల్ గా త్వరగా అయిపోతాయి.








కావలసిన పదార్ధాలు:

 
మొక్కజొన్న కండెలు                        రెండు
 
ఉల్లిపాయ                                    ఒకటి
 
మిర్చి                                       నాలుగు
 
కొత్తిమీర                                   ఒక కట్ట
 
కరివేపాకు                                ఒక రెమ్మ 
 
అల్లం                                      చిన్న ముక్క
 
జీలకర్ర                                    ఒక టీ స్పూన్
 
ఉప్పు                                       తగినంత
 
నూనె
 
శనగపిండి                                రెండు టేబుల్ స్పూన్స్ 

(అవసరం అయితే )

 
తయారు చేసే విధానం:


మొక్కజొన్నలు వలిచి తగినంత ఉప్పు,జీలకర్ర ,అల్లం,రెండు మిర్చి 

కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.గ్రైండ్ చేసేప్పుడు నీరు అసలు వాడొద్దు

ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ,మిర్చి,కొత్తిమీర,కరివేపాకు వేసి 

కలపాలి.
 
చిన్నచిన్న వడలు చేసి కాగిన నూనెలో వేయించాలి.

పొత్తులు లేతగా ఉండి, పిండి పలుచగా అయితే శనగపిండి కలపాలి. 

లేకపోతే అవసరం లేదు 

అలాగే ఇష్టం ఉంటే కొన్ని గింజలు గ్రైండ్ చెయ్యకుండా ఉంచి పిండిలో 

కలుపుకోవచ్చు


Share/Bookmark

2 comments:

శిశిర

ఎన్ని ఐటెమ్స్ తెలుసో మీకు. :) మీ ఈ బ్లాగ్ కూడా తరచుగా చూస్తుంటాను. మీ ప్రెజెంటేషన్ బాగుంటుంది.

లత

శిశిరా, థాంక్ యూ వెరీమచ్

Post a Comment

అభిరుచి   © 2008. Template Recipes by Emporium Digital

TOP