యాపిల్ - డేట్స్ మిల్క్ షేక్
యాపిల్ ముక్కలు,కొంచెం ఖర్జూరాలు కలిపి చేసే మిల్క్ షేక్ ఇది
వెరైటీ రుచితో పిల్లలు ఇష్టపడేలా ఉంటుంది.
కావలసిన పదార్ధాలు:
యాపిల్ ముక్కలు చిన్నకప్పు
ఖర్జూరాలు అయిదారు
పంచదార ఒక టీస్పూన్
పాలు ఒక కప్పు
ఇలాచీ పొడి చిటికెడు
తయారు చేసే విధానం:
సన్నగా తరిగిన ఖర్జూరాలను కొంచెం పాలలో పావుగంట నాననివ్వాలి.
ఇందులో పంచదార,యాపిల్ ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇప్పుడు పాలు పోసి ఒకసారి బ్లెండ్ చేస్తే సరిపోతుంది.
ఇష్టమైతే ఇలాచీపొడి వేయొచ్చు.వేయకపోయినా పర్లేదు.
కొద్దిగా యాపిల్ ముక్కలు,ఖర్జూర ముక్కలు వేసి ఇస్తే బావుంటుంది.
ఇందులో పంచదార బదులు తేనె అయినా వేసుకోవచ్చు.
2 comments:
కొత్త రుచి, వాతావరణం వేడెక్కాక చేసి చూస్తాను.
అవునండి, పిల్లలకి కొంచెం వెరైటీ
Post a Comment