చికెన్ 65
చికెన్ తో చేసే స్నాక్ వెరైటీస్ లో ముఖ్యమైనది చికెన్ 65 .అందరూ
చాలా ఇష్టపడే ఈ ఐటంని ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు.
కావలసిన పదార్ధాలు:
మారినేషన్ కు
చికెన్ పావుకిలో
మైదా రెండు టీ స్పూన్స్
కార్న్ ఫ్లోర్ రెండు టీ స్పూన్స్
ఎగ్ ఒకటి
మిరియాలపొడి అర స్పూన్
ఉప్పు,అల్లంవెల్లుల్లి ముద్ద,గరంమసాలా పొడి
తాలింపుకు
వెల్లుల్లి రెబ్బలు నాలుగు
అల్లం చిన్న ముక్క
పచ్చిమిర్చి ఆరు
కరివేపాకు రెండు రెమ్మలు
పెరుగు ఒక చిన్న కప్పు
అజినిమోటో చిటికెడు
నూనె,ఉప్పు,కారం,కొత్తిమీర.
తయారు చేసే విధానం:
బోన్ లెస్ చికెన్ ను చిన్న ముక్కలుగా కోసుకోవాలి.
ఒక బౌల్ లో మైదా,కార్న్ ఫ్లోర్,ఉప్పు,మిరియాలపొడి,అర టీ స్పూన్
అల్లంవెల్లుల్లి ముద్ద,అర స్పూన్ గరంమసాలా పొడి,ఎగ్ వేసి బాగా
కలిపి,చికెన్ ముక్కలు కూడా వేసి ఒక అరగంట నానబెట్టుకోవాలి.
కాగిన నూనెలో ఈ ముక్కలని డీప్ ఫ్రై చేసి తీసుకోవాలి.
ఇప్పుడు రెండు టీ స్పూన్స్ నూనె వేడిచేసి సన్నగా తరిగిన వెల్లుల్లి,
అల్లం ముక్కలు,వాలికలుగా కోసిన మిర్చి వేసి వేయించాలి.
కరివేపాకు కూడా వేసి వేగనివ్వాలి.
పెరుగులో కొంచెం కారం కలిపి బీట్ చేసి తాలింపులో వేసి వేయించిన
చికెన్ ముక్కలు కూడా వేయాలి.
చిటికెడు ఉప్పు,అజినిమోటో వేసి కలుపుతూ తడి లేకుండా డ్రైగా
అయ్యేవరకూ ఉంచాలి.
చివరగా కొత్తిమీర చల్లితే ఎంతో రుచిగా ఉండే చికెన్ 65 నోరూరిస్తుంది.
నోట్: నేను ఫుడ్ కలర్ వాడలేదు.ఇష్టమైతే నానబెట్టేటప్పుడు కానీ,
పెరుగులో కానీ కొంచెం రెడ్ ఆరెంజ్ కలర్ కలుపుకోవచ్చు.
0 comments:
Post a Comment