Sunday, January 8, 2012

పొట్లకాయ పెరుగుపచ్చడి

పెరుగు కలిపి చేసే పచ్చళ్లలో ముఖ్యమైనది ఈ పొట్లకాయ పచ్చడి.

అన్ని రోటిపచ్చళ్ళ లాగానే ఇది కూడా చేయడం తేలికే.అన్నంలోకి 

బావుంటుంది.








కావలసిన పదార్ధాలు:


పొట్లకాయ                  ఒకటి చిన్నది 

పచ్చిమిర్చి                 ఏడెనిమిది 

పెరుగు                     ఒక చిన్న కప్పు 

వెల్లుల్లిరెబ్బలు              నాలుగు

జీలకర్ర                       అర స్పూన్ 

చింతపండు                  కొద్దిగా 

ఉల్లిపాయ                    ఒకటి 

తాలింపుదినుసులు,కరివేపాకు,ఉప్పు,నూనె 


తయారు చేసే పధ్ధతి :


పొట్లకాయ చెక్కు గీసి చిన్నముక్కలు కోసుకోవాలి.ఈముక్కల్లో కొంచెం 

ఉప్పు కలిపి పదినిమిషాలు ఉంచి నీరు పిండేయాలి.ఇలా చేయకపోతే 

పచ్చడి వగరుగా ఉంటుంది.

ఈ ముక్కలకు పచ్చిమిర్చిని కలిపి రెండు టీ స్పూన్స్ నూనె వేసి 

వేయించుకోవాలి.మిర్చి,ఉప్పు,చింతపండు,జీలకర్ర,వెల్లుల్లి కలిపి గ్రైండ్ 

చేసుకుని,పొట్లకాయ ముక్కలు కూడా వేసి గ్రైండ్ చెయ్యాలి.

చివరగా పెరుగు వేసి ఒకసారి గ్రైండ్ చెయ్యాలి.

ఒక టేబుల్ స్పూన్ నూనె వేడిచేసి తాలింపు వేసుకోవాలి.కరివేపాకు 

కూడా వేగాక చిటికెడు పసుపు,సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు 

వేసి స్టవ్ ఆఫ్ చెయ్యాలి.ఉల్లిముక్కలు వేయించకూడదు,అప్పుడే అవి 

కరకరలాడుతూ పచ్చడి బావుంటుంది.

ఈ తాలింపును పచ్చడిలో కలపాలి.


Share/Bookmark

2 comments:

జయ

బాగుందండి. ఒకవేళ ఉల్లిపాయ, వెల్లిపాయ వేయకపోతే రుచిపోతుందంటారా....

లత

జయగారు
ఉల్లిపాయ అసలు ఆప్షనల్ అండీ వెయ్యకపోయినా పర్లేదు.ఇక వెల్లుల్లి కూడా అలవాటు కనుక వేస్తాము.వెయ్యకుండా చేసి చూడండి.

Post a Comment

అభిరుచి   © 2008. Template Recipes by Emporium Digital

TOP