Saturday, June 23, 2012

రైస్ - ఓట్స్ టిక్కీస్ (బాల్స్)

సన్నగా వర్షం పడుతుంటే వేడివేడిగా తినాలనిపిస్తుంది ఎవరికైనా.

రెగ్యులర్ గా చేసే బజ్జీలు,పకోడీలు పక్కన పెట్టి కొంచెం వెరైటీగా ఇవి 

చేసి చూస్తే  భలే ఉన్నాయి.నాకైతే టిక్కీల కంటే కూడా బాల్స్ ఇంకా 

బాగా నచ్చాయి 

.







కావలసిన పదార్ధాలు:


అన్నం                      ఒక కప్పు 

ఓట్స్                         అర కప్పు 

ఆలూ                         రెండు 

ఉల్లిపాయ                    ఒకటి 

పచ్చిమిర్చి                  రెండు 

అల్లం                       ఒక స్పూన్ 

పుదీనా                     రెండు స్పూన్స్ 

కొత్తిమీర                    రెండు స్పూన్స్ 

కార్న్ ఫ్లోర్                 ఒక టేబుల్ స్పూన్

చాట్ మసాలా              ఒక టీ స్పూన్ 

బ్రెడ్ క్రంబ్స్                   అర కప్పు 

ఉప్పు,నూనె 




తయారు చేసే విధానం:



అన్నం ఒక బౌల్ లోకి తీసుకుని మెత్తగా మాష్ చేసుకోవాలి.

ఉడికించిన ఆలూ కూడా మాష్ చేసి అన్నంలో వెయ్యాలి.

ఇందులో సన్నగా తరిగిన ఉల్లి,మిర్చి,అల్లం,పుదీనా,కొత్తిమీర వేయాలి.

చివరగా ఓట్స్,కార్న్ ఫ్లోర్ ,తగినంత ఉప్పు,చాట్ మసాలాపొడి వేసి 

బాగా కలుపుకోవాలి.

ఈ మిశ్రమాన్ని చిన్నచిన్న టిక్కీలు కానీ,బాల్స్ కానీ చేసి బ్రెడ్ 

క్రంబ్స్ లో రోల్ చేసి కాగిన నూనెలో వేయించాలి. ఎర్రగా వేగాక తీసి

 పేపర్ నాప్ కిన్ పై ఉంచాలి.

వేడివేడిగా టమాటా సాస్ తో తింటే బావుంటాయి.


Share/Bookmark

4 comments:

జ్యోతిర్మయి

ఇవి ఎక్కువ నూనె పీల్చవా లతగారూ...

లత

లేదు జ్యోతిగారూ,నేనూ ఫస్ట్ అలాగే అనుకున్నాను కానీ, ఆయిలీగా అనిపించలేదు
ఒక్కటే జాగ్రత్త నూనె కరెక్ట్ వేడిలో ఉండాలి.అంతే.

ఇందు

baagunnayandi :) variety combination :)

లత

అవును ఇందూ

Post a Comment

అభిరుచి   © 2008. Template Recipes by Emporium Digital

TOP