Wednesday, June 20, 2012

పనీర్ - టమాటా పులావ్

టమాటా ప్యూరీ,పనీర్ కలిపి చేసే ఈ రైస్ డిష్ కోసం ఎక్కువ పదార్ధాలు 

 అవసరం ఉండదు చల్లని ఈ వెదర్ లో స్పైసీగా చాలా బావుంటుంది.








కావలసిన పదార్ధాలు :


సన్నబియ్యం                       ఒక గ్లాస్ 

పనీర్                               వంద గ్రాములు 

టమాటాలు                          మూడు 

ఉల్లిపాయ                           ఒకటి 

పచ్చిమిర్చి                         మూడు 

కరివేపాకు                          ఒక రెమ్మ 

కొత్తిమీర                            ఒక కట్ట 

పుదీనా                            ఒక కట్ట 

ఉప్పు,కారం,పసుపు,అల్లంవెల్లుల్లి పేస్ట్,గరంమసాలా పొడి,నూనె.

లవంగాలు,చెక్క,షాజీర,బిర్యానీ ఆకు 




తయారు చేసే విధానం:


పనీర్ ను చిన్న ముక్కలుగా కోసుకుని కొంచెం ఉప్పు,కారం,పసుపు,

పావు స్పూన్ గరంమసాలా పొడి వేసి కలిపి ఒక పావుగంట మారినేట్ 

చెయ్యాలి.

బియ్యం కడిగి ఒక పావుగంట నానబెట్టుకోవాలి.

టమాటాలు ఉడికించి గ్రైండ్ చేసి  ప్యూరీ చేసుకోవాలి.లేదా రెడీమేడ్ 

ప్యూరీ అయినా వాడొచ్చు.

పాన్ లో నూనె వేడి చేసి  నాలుగు లవంగాలు,చెక్క,బిర్యానీ ఆకు,ఒక 

స్పూన్ షాజీర వేసి వేయించాలి.

ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లి,మిర్చి,కరివేపాకు వేసి వేగనివ్వాలి.ఒక 

టేబుల్ స్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేగిన తరువాత టమాట ప్యూరీ 

వేయాలి.

సన్నగా తరిగిన పుదీనా,కొత్తిమీర వేసి బాగా వేయించి మారినేట్ చేసిన 

పనీర్ ముక్కలు వేసి కలపాలి.

తగినంత కారం,పసుపు,ఒక టేబుల్ స్పూన్ గరంమసాలా పొడి వేసి 

బాగా కలిపి రెండుగ్లాసుల నీళ్ళు పోసి మరిగాక బియ్యం,తగినంత 

ఉప్పు వేసి కలిపి మూత  పెట్టి మూడు విజిల్స్ రానివ్వాలి.

స్టీం పోయిన తరువాత తీసి ఒకసారి కలిపి కొంచెం కొత్తిమీర చల్లుకోవాలి.

వేడివేడిగా పెరుగుపచ్చడితో తింటే ఈపులావ్ చాల రుచిగా ఉంటుంది. 


Share/Bookmark

2 comments:

ఇందు

chala bagundandi :) manchi item. thanks!

లత

బావున్నారా ఇందూ,చాలా రోజులకు కనిపించారు,బిజీనా
మీ అన్ని కామెంట్స్ కూ ఇక్కడే థాంక్యూలు చెప్తున్నాను.
థాంక్యూ వెరీమచ్

Post a Comment

అభిరుచి   © 2008. Template Recipes by Emporium Digital

TOP