అటుకుల పులిహోర
చాలా ఈజీగా అయిదు నిమిషాల్లో అయిపోయే టిఫిన్ ఇది.ఎన్నో రకాల
పులిహోరల్లో
ఇదీ ఒకటి.లైట్ టిఫిన్ గా ఉదయమైనా,సాయంత్రమైనా
తినొచ్చు.
కావలసిన పదార్ధాలు:
అటుకులు రెండు మూడు కప్పులు
ఉల్లిపాయ ఒకటి
పచ్చిమిర్చి మూడు
కరివేపాకు ఒక రెమ్మ
అల్లం చిన్న ముక్క
చింతపండుపేస్ట్ రెండు టీ స్పూన్స్
ఉప్పు,నూనె, పసుపు
తాలింపుకు
శనగపప్పు,మినపప్పు,ఆవాలు,పల్లీలు,ఎండుమిర్చి
తయారు చేసే విధానం:
లావు అటుకులను కడిగి నీరు వంపెయ్యాలి.ఒక ఐదునిమిషాలు
తయారు చేసే విధానం:
లావు అటుకులను కడిగి నీరు వంపెయ్యాలి.ఒక ఐదునిమిషాలు
పక్కన పెడితే మిగిలిన
తడికి మెత్తబడి పోతాయి
ఉల్లి,మిర్చి,అల్లం సన్నగా తరగాలి.
నూనె వేడి చేసి తాలింపు వేసి పల్లీలు బాగా వేగిన తరువాత కరివేపాకు,
ఉల్లి
ముక్కల మిశ్రమం వేసి చేయించాలి.
పసుపు వేసి అటుకులు,తగినంత ఉప్పు,చింతపండు పేస్ట్ అన్నీ వేసి
బాగా కలపాలి.
అంతే పుల్లపుల్లగా ,కొంచెం కారంగా ఉండే అటుకుల పులిహోర రెడీ.
3 comments:
Hostel lo vunnappudu ilaanti blogs choodakoodadu.. :-(
థాంక్సండి. నేను try చేశాను. రుచికి బాగానే వచ్చింది. కానీ అటుకులు ముద్ద ముద్ద అయిపోయాయి. Hotel లో పొడి పొడిగా ఉంటుంది. కారణం ఏంటంటారు?
గంగాధర్ గారూ,
అటుకులు కడిగినప్పుడు నీరు పూర్తిగా వంపెయ్యాలి.యే మాత్రం నీరు ఉన్నా మెత్తగా అయిపోయి ముద్ద అవుతుందండి
Post a Comment