Sunday, September 9, 2012

సగ్గుబియ్యం - సొరకాయ పాయసం

చాలామంది సొరకాయ ఇష్టంగా తింటారు.చాలామంది తినరు కూడా.

ఏది ఏమైనా ఆరోగ్యానికి మాత్రం చాలా మంచిదైన ఈ సొరకాయతో 

కూరలే కాదు క్రీమీగా ఉండే ఈ పాయసం కూడా బావుంటుంది.చేసి 

చూడండి.






కావలసిన పదార్ధాలు:



సొరకాయ తురుము               ఒక కప్పు 

సన్న సగ్గుబియ్యం                రెండు టీ స్పూన్స్ 

పాలు                               అర లీటరు 

పంచదార                          అర కప్పు 

ఇలాచీ పొడి                       ఒక టీ స్పూన్ 

నెయ్యి                             ఒక టేబుల్ స్పూన్ 

కాజూ,బాదం,కిస్మిస్ 



తయారు చేసే విధానం:



సొరకాయ చెక్కు తీసి తురుముకుని నీరు పిండేసి ఉంచుకోవాలి.

నెయ్యి వేడి చేసి కాజూ,కిస్మిస్ వేయించి తీసుకోవాలి.

ఇదే నేతిలో సొరకాయ తురుము నాలుగైదు నిముషాలు వేయించాలి.

ఇప్పుడు పాలు పోసి,సగ్గుబియ్యం కూడా వేసి ఉడికించాలి.

సగ్గుబియ్యం ఉడికి,సొరకాయ తురుము మెత్తగా అయ్యాక పంచదార 

వేసి కలపాలి.

పాయసం చిక్కబడుతుండగా ఇలాచీ పొడి కలిపి స్టవ్ ఆఫ్ చెయ్యాలి.

కాజూ,బాదం,కిస్మిస్ వేసి కలిపి ఫ్రిజ్ లో ఉంచి చల్లగా సర్వ్ చెయ్యాలి.

సగ్గుబియ్యం ఆప్షనల్.వెయ్యకుండా కూడా చెయ్యొచ్చు.అలాగే సన్నవి 

లేకపోతే మామూలు సగ్గుబియ్యం కూడా వాడొచ్చు.




Share/Bookmark

3 comments:

ఇందు

Nice idea andi :) Kani Sorakaaya mukkalu neyyi lo veyistunte edo smell vastondi :( adi poyedelaa?

Inkaa saggubiyyam naanbettaalaa mundugaa? ledu...alage veseyocha?

లత

ముక్కలుగా వద్దు ఇందూ.తురిమేసి నీరు పిండేసి నెయ్యిలో వేయిస్తే సరిపోతుంది

సన్న సగ్గుబియ్యం అయితే కడిగేసి వేసెయ్యొచ్చు.మామూలు సగ్గుబియ్యం అయితే నానబెడితే త్వరగా, బాగా ఉడుకుతాయి

ఇందు

Thanx andi :) alage chesi chustanu!

Post a Comment

అభిరుచి   © 2008. Template Recipes by Emporium Digital

TOP