నాన్ కటాయి
ఈ కుకీస్ ను ఎప్పుడో ఒకసారి టీవీ షోలో చూశాను.చాలా నచ్చాయి.
సింపుల్ గా పావుగంటలో చేసేసుకోవచ్చు.తింటుంటే కరిగిపోతూ చాలా
బావుంటాయి.
కావలసిన పదార్ధాలు:
మైదాపిండి ఒకటిన్నర కప్పు
పంచదార ఒక కప్పు
నెయ్యి ఒక కప్పు
ఇలాచీ పొడి అర స్పూన్
కాజూ కొద్దిగా
తయారు చేసే విధానం:
పంచదారను పొడి చేసుకోవాలి
నెయ్యి,పంచదార పొడి బాగా కలిపి,మైదాపిండి,ఇలాచీపొడి వేయాలి.
ఈ మిశ్రమాన్ని ముద్దగా చేసుకోవాలి.ఈ లోగా మైక్రోవేవ్ ను కన్వెక్షన్
మోడ్ లో 180 డిగ్రీల లో ప్రీహీట్ చెయ్యాలి.
మిశ్రమాన్ని చిన్నచిన్న బిస్కెట్స్ లా చేసి,కాజూను అద్ది బేకింగ్ ట్రే లో
ఉంచి 12 - 15 నిముషాలు బెక్ చేస్తే సరిపోతుంది.ఓవెన్ ను బట్టి
రెండు నిముషాలు ఎక్కువ తక్కువ పట్టొచ్చు.
పైన కొంచెం సాఫ్ట్ గా ఉన్నట్టు అనిపించినా చక్కగా పొంగి చాలా
క్రిస్పీగా బేక్ అవుతాయి.
క్రిస్పీగా బేక్ అవుతాయి.
కాజూ,బాదం సన్నగా తరిగి పిండిలోకలిపేసి అయినా చెయ్యొచ్చు.
నోట్ : ఇందులో నెయ్యి వేసేటప్పుడు కరిగించనవసరం లేదు.
1 comments:
ఇవి మా పిల్లల చిన్నప్పుడు చాలా చేసేదానిని . ఈ మధ్య చేద్దామంటే ఎలా చేసే దానినో మర్చిపోయాను :) అదమిటో మా ఫ్రెండ్స్ కూడా మర్చిపోయామన్నారు :) ఈ రోజు అనుకోకుండా ఇక్కడ చూసాను . థాంక్ యు .
Post a Comment