Tuesday, December 20, 2011

సాదా (తొక్కుడు)లడ్డు

మేము సాదాలడ్డు అంటాము.కొంతమంది తొక్కుడులడ్డు అంటారు.

దీనినే బందరు లడ్డు అని కూడా అంటారు.కారప్పూస వండి గ్రైండ్ చేసి 

కొంచెం పనే కానీ రుచి చాలా బావుంటుంది.








కావలసిన పదార్ధాలు:


శనగపిండి                     రెండు కప్పులు 

పంచదార                      రెండు కప్పులు 

ఇలాచీ పొడి                   అర స్పూన్ 

నెయ్యి                          ఒక కప్పు

కాజూ, నూనె 


తయారు చేసే విధానం:


శనగపిండి జల్లించి తగినన్ని నీళ్ళతో ముద్దగా కలుపుకోవాలి.

కాగిన నూనెలో ఈ పిండిని కారప్పూస వత్తుకుని రెండువైపులా 

వేయించి తీసుకోవాలి.అయితే ఎర్రబడనివ్వకూడదు

కొంచెం చల్లారాక ఈ కారప్పూసను మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

పంచదారలో కొంచెం నీళ్ళు పోసి కరిగించి పాకం పట్టుకోవాలి.ఇందులో 

గ్రైండ్ చేసుకున్నపొడి,కరిగిన నెయ్యి,యాలకుల పొడి వేసి కలపాలి.

కొంచెం చల్లారాక ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసి తీసుకోవాలి.(ఈ స్టెప్ 

ఆప్షనల్.లడ్డూ సాఫ్ట్ గా రావడం కోసం నేను ఇలా చేస్తాను. అసలు 

అయితే ఈ మిశ్రమాన్నిరోట్లోవేసి దంచి లడ్డూలు చేస్తారు.అందుకే 

తొక్కుడులడ్డు అని పేరు )

నేతిలో వేయించిన కాజూ కలిపి లడ్డూలు చేసుకోవాలి.






Share/Bookmark

4 comments:

మధురవాణి

భలే ఉన్నాయండీ లడ్డూలు.. స్వీట్లంటే పెద్దగా ఇష్టం లేని నాక్కూడా ప్లేట్లోంచి ఒక లడ్డూ తీసుకుని తినాలనిపిస్తోంది.. :))

లత

అంత నచ్చాయా మధురా, థాంక్యూ

వేణూశ్రీకాంత్

నాకు ఈ తొక్కుడు లడ్డు చాలా ఇష్టమండీ విజయవాడలో చదువుకునే రోజుల్లో రెగ్యులర్ గా కొనుక్కునే వాడ్ని కానీ కారప్పూస గ్రైండ్ చేసి చేస్తారని తెలీదు డైరెక్ట్ గా శనగపిండితోనే చేస్తారేమో అనుకునే వాడ్ని. ఫోటో చూస్తుంటే నోరూరిపోతుంది :-)

లత

థాంక్యూ వేణుగారు,
అవునండీ, కారప్పూసలా కానీ,కొంచెం లావుగా చక్కిడాలలా కానీ వండి,గ్రైండ్ చేసి చేస్తారు.

Post a Comment

అభిరుచి   © 2008. Template Recipes by Emporium Digital

TOP