Wednesday, December 28, 2011

కాప్సికమ్ బజ్జీ (ఆలూ స్టఫ్డ్ )

చల్లని వాతావరణంలో అందరూ బజ్జీలు ఇష్టపడతారు.ఆలూ కర్రీ స్టఫ్ 

చేసి చేసే ఈ కాప్సికమ్ బజ్జీ వెరైటీగా ఉంటుంది.కూర రెడీగా ఉంటే 

అయిదు నిమిషాల్లో చేసెయ్యొచ్చు.








కావలసిన పదార్ధాలు:


కాప్సికమ్                         ఒకటి 

ఆలూ కర్రీ                       ఒక కప్ 

శనగపిండి                      ఒక కప్ 

బియ్యంపిండి                మూడు టీ స్పూన్స్ 

ఉప్పు,కారం,చిటికెడు వంటసోడా,నూనె 



తయారు చేసే విధానం:


కాప్సికమ్ లోగింజలు తీసేసి పొడవుగా వాలికలుగా కోసుకోవాలి.

ఈ కాప్సికమ్ స్ట్రిప్ లో ఆలూకర్రీ స్టఫ్ చేసుకోవాలి. 

శనగపిండి.బియ్యంపిండి ఒక బౌల్ లో వేసుకుని తగినంత  ఉప్పు,

కారం,వంటసోడా వేసి బజ్జీల పిండిలా కలుపుకోవాలి. 

స్టఫ్ చేసిన కాప్సికమ్ స్త్రిప్స్ ను ఈ పిండిలో ముంచి కాగిన నూనెలో 

బజ్జీలు వేసి,రెండువైపులా వేయించి తీయాలి.

వేడిగా టమాటా సాస్ తో తింటే బావుంటాయి,.


Share/Bookmark

2 comments:

కృష్ణప్రియ

లత గారు,

ఇదే కూర లాగా, పెనం మీద లైట్ గా నూనె రాసి సన్నటి సెగ మీద కాసేపు ఉంచి తీసేస్తాను.. (సెనగపిండి లో ముంచి వేయించకుండా).. దీనివల్ల బయట కాప్సికం పూర్తిగా ఉడకదు అది ఓకే. ఉప్పు అంటదు, కాబట్టి చాలా చప్పగా ఉంటుంది కాప్సికం ముక్క... అదే విసుగ్గా ఉంటుంది. ఏదైనా చిట్కా ఉంటే చెప్పగలరు.

లత

కృష్ణప్రియగారూ,
కాప్సికం ముక్కల్ని కొంచెం ఉప్పు కలిపిన నీళ్ళల్లో కొద్దిగ ఉడికించి తరువాత ట్రై చెయ్యండి
ఇది జస్ట్ ఒక ఐడియా, చేసి చూడండి

Post a Comment

అభిరుచి   © 2008. Template Recipes by Emporium Digital

TOP