మేథీ - కార్న్ పులావ్
రకరకాల కాంబినేషన్స్ తో చేసే రైస్ ఐటమ్స్ ఎప్పుడూ నచ్చుతాయి.
ఆకుపచ్చని మెంతికూర,స్వీట్ కార్న్ కలిపి చేసే ఈ పులావ్ కూడా
ఈజీగా చేసెయ్యొచ్చు.పెరుగు చట్నీ దీనిలోకి బావుంటుంది.
కావలసిన పదార్ధాలు:
బాస్మతి రైస్ రెండు కప్పులు
స్వీట్ కార్న్ ఒక కప్పు
మెంతి కూర మూడు కట్టలు
టమాటాలు రెండు
ఉల్లిపాయ ఒకటి
పచ్చిమిర్చి రెండు
కొత్తిమీర ఒక కట్ట
ఉప్పు,కారం,పసుపు,నూనె,అల్లంవెల్లుల్లి పేస్ట్,గరంమసాలా పొడి.
లవంగాలు,చెక్క,షాజీర.
తయారు చేసే విధానం:
బియ్యం కడిగి నానబెట్టుకోవాలి.
పాన్ లో నూనె వేడిచేసి చెక్క,లవంగాలు,షాజీర వేసి వేగనివ్వాలి.
ఇప్పుడు వాలికలుగా తరిగిన ఉల్లి,మిర్చి వేసి వేయించి టమాటా
ముక్కలు వేయాలి.
ముక్కలు వేయాలి.
టమాటాలు మెత్తగా ఉడికిన తరువాత పసుపు,కారం,ఒక టేబుల్
స్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేయించి తరిగిన మెంతికూర,స్వీట్
కార్న్,ఒక టేబుల్ స్పూన్ గరంమసాలా పొడి వేసి కలపాలి.
కార్న్,ఒక టేబుల్ స్పూన్ గరంమసాలా పొడి వేసి కలపాలి.
రెండు మూడు నిముషాలు వేయించి తగినన్ని నీళ్ళు,ఉప్పు వేయాలి.
నీరు మరిగినప్పుడు బియ్యం వేసి కలిపి మూతపెట్టి మూడు విజిల్స్
వచ్చాక స్టవ్ ఆఫ్ చెయ్యాలి.
స్టీం అంతా పోయిన తరువాత తీసి ఒకసారి కలిపి వేడిగా సర్వ్
చెయ్యాలి. వేడివేడిగా ఏదైనా రైతాతో తింటే బావుంటుంది.
చెయ్యాలి. వేడివేడిగా ఏదైనా రైతాతో తింటే బావుంటుంది.
ఇందులో స్వీట్ కార్న్ బదులు మామూలు కార్న్ అయినా వాడొచ్చు.
4 comments:
Nice post andi :)
థాంక్స్ ఇందూ
Aug lo posts emi veyaledu...?.? Evertthing is fine kadaa?. Mee posts kosam eduru chustu untanu :)
థాంక్యూ ఇందూ,
సారీ,చాలా లేట్ గా రిప్లై ఇస్తున్నందుకు
ఇప్పుడు అంతా ఓ.కే
కొంచెం పని వత్తిడి,కొంచెం హెల్త్ ప్రాబ్లంతో రాయడం కుదరలేదు.త్వరలో రాస్తాను,
థాంక్యూ వెరీమచ్ ఫర్ యువర్ కన్సర్న్.
Post a Comment