శనగలతో వడలు
శ్రావణ మాసం ఇంటినిండా శనగలు ఉంటాయి.తాలింపు వేసి తినమంటే
ఎప్పుడూ ఇంతేనా బోర్ అంటారు పిల్లలు.అవేమో మొలకలు
వచ్చేస్తుంటాయి.అందుకే అల్లం,మిర్చి వేసి రుబ్బి వడలు చేసెయ్యండి.
పది నిమిషాల్లో క్రిస్పీగా కరకరలాడుతూ రెడీ అయిపోతాయి.
పది నిమిషాల్లో క్రిస్పీగా కరకరలాడుతూ రెడీ అయిపోతాయి.
కావలసిన పదార్ధాలు :
శనగలు,అల్లం,మిర్చి,జీలకర్ర,ఉల్లిపాయ,కరివేపాకు,కొత్తిమీర,ఉప్పు,
నూనె
తయారు చేసే పద్ధతి
శనగలు కడిగి చిన్నఅల్లం ముక్క ,రెండు మిర్చి,తగినంత ఉప్పు,జీలకర్ర
వేసి మెత్తగా గ్రైండ్ చెయ్యాలి.ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ,
నూనె కాగాక చిన్న చిన్నవడలు చేసి వేయించాలి.పలుచగా చేస్తే కరకర
లాడుతూ వస్తాయి.వేడిగా సాస్ తోనో,చట్నీతోనో తినడమే.
2 comments:
లతహారు చూడటానికే ఎంత బాగున్నాయో. మీరు చెప్పిన అటుకుల దోశలు చేసాను. ఎంత బాగా వచ్చాయో. ఇవి కూడా ట్రై చేస్తాను.
థాంక్యూ జయగారు,
చేసి చూడండి,నచ్చుతాయి.
Post a Comment