Wednesday, August 31, 2011

వెజ్ పులావ్

సింపుల్ గా అయిపోయే రైస్ ఐటం అంటే వెజిటబుల్ పులావ్ అనే 

చెప్పాలి.అన్నిరకాల కూరలూ వేసేసి పదినిమిషాల్లో చేసెయ్యొచ్చు.

దీనిలోకి జతగా పెరుగుపచ్చడి చేసేస్తే సరిపోతుంది. 







కావలసిన పదార్ధాలు:


బియ్యం                                ఒక గ్లాస్

మిక్స్డ్ వెజిటబుల్స్                    ఒక కప్పు

టమాటాలు                              రెండు 

అల్లంవెల్లుల్లి ముద్ద                  రెండు టీ స్పూన్స్  

గరంమసాలా పొడి                    రెండు స్పూన్స్

పుదీనా,కొత్తిమీర                     అర కప్పు 

నూనె,ఉప్పు                           తగినంత

పసుపు                                 కొద్దిగా 

 కారం                                  అరస్పూన్

పెరుగు                                 రెండు టేబుల్ స్పూన్స్


లవంగాలు,చెక్క,యాలకులు,షాజీర,బిర్యాని ఆకు,

అనాస పువ్వు,జాపత్రి 


తయారు చేసే పధ్ధతి:


బియ్యం కడిగి నానబెట్టుకోవాలి

నూనె వేడిచేసి మసాలాదినుసులు అన్నీ వేయాలి.దోరగా వేగాక 

వాలికలుగా తరిగిన ఉల్లి,మిర్చి వేసి వేయించాలి.ఇప్పుడు అల్లంవెల్లుల్లి

ముద్ద వేసి వేగిన తరువాత సన్నగా తరిగిన కూరగాయలు,బటానీలు,

స్వీట్ కార్న్ అన్నీవేసి కొంచెం వేయించాలి.

చివరగా టమాటాముక్కలు, పెరుగు వేసి బాగా ఉడికించాలి.పసుపు, 

కారం,గరంమసాలాపొడి,పుదినా,కొత్తిమీర వేసి బాగా కలిపి నీళ్ళు పోసి 

తగినంత ఉప్పు కూడా వేయాలి.

నీరు మరిగాక నానబెట్టిన బియ్యం వేసి కలిపి మూతపెట్టి మూడు 

విజిల్స్ రానివ్వాలి.

ఇందులో ఆలూ,కారట్,పచ్చిబటానీ,కాప్సికం,స్వీట్ కార్న్,బీన్స్ ఇలా 

 అన్నిరకాలూ వాడొచ్చు.


Share/Bookmark

Monday, August 29, 2011

కారట్ రైస్

కారట్,నిమ్మరసం కలిపి చేసే ఈ రైస్ ఐటం లంచ్ బాక్స్ లోకి 

బావుంటుంది.నిమ్మరసం వేయడంతో అచ్చం పులిహోర లానే 

ఉంటుంది.






కావలసిన పదార్ధాలు:


అన్నం                              రెండు కప్పులు 

కారట్ తురుము                    ఒక కప్పు 

పచ్చిమిర్చి                         మూడు 

అల్లం                               చిన్న ముక్క 

కరివేపాకు                                  ఒక రెమ్మ

నిమ్మకాయ                       ఒకటి 

ఉప్పు,పసుపు,నూనె 

తాలింపుకు 

శనగపప్పు,మినప్పప్పు,ఎండుమిర్చి,ఆవాలు,పల్లీలు


తయారు చేసే విధానం ;


నూనె వేడిచేసి తాలింపు వేయాలి.

దోరగా వేగిన తరువాత సన్నగా తరిగిన అల్లం,మిర్చి,కరివేపాకు వేసి 

వేయించాలి.

ఇప్పుడు కారట్ తురుము వేసి తడి లేకుండా బాగా వేయించాలి.
.
చివరగా అన్నం,తగినంత ఉప్పు,పసుపు వేసి కలిపి కొంచెం వేయించాలి

చల్లారిన తరువాత నిమ్మరసం వేసి కలిపితే కలర్ ఫుల్ గా ఉండే కారట్

రైస్ రెడీ అవుతుంది.









Share/Bookmark

Saturday, August 27, 2011

కాలీఫ్లవర్ బటానీ ఫ్రై

కాలీఫ్లవర్ ను దేనితో కలిపి వండినా రుచిగా ఉంటుంది.చాలా సన్నగా 

తురుములాగా తరిగి,పచ్చిబటానీ వేసి వండితే చాలా బావుంటుంది.

బటానీలను కొంచెం మెదిపి ఈ కూరతో పరోటాలు కూడా చేసుకోవచ్చు.




 



కావలసిన పదార్ధాలు:


కాలీఫ్లవర్                         ఒకటి చిన్నది 

పచ్చిబటానీ                      ఒక కప్పు 

ఉల్లిపాయ                         ఒకటి

మిర్చి                              రెండు

కరివేపాకు                         ఒక రెమ్మ 

అల్లంవెల్లుల్లి ముద్ద              ఒక స్పూన్ 

గరంమసాలా పొడి                ఒక స్పూన్

ఉప్పు,కారం                       తగినంత 

పసుపు                            కొంచెం 

నూనె                               రెండు టేబుల్ స్పూన్లు 

తాలింపుకు  శనగపప్పు, మినప్పప్పు,ఆవాలు,జీలకర్ర,ఎండుమిర్చి 


తయారు చేసే విధానం :


నూనె వేడిచేసి తాలింపు వేసుకోవాలి 

సన్నగా తరిగిన ఉల్లి,మిర్చి,కరివేపాకు వేసి దోరగా వేయించాలి.

అల్లంవెల్లుల్లి ముద్ద వేసి పచ్చివాసన పోయేవరకు వేయించి సన్నగా 

తరిగిన కాలీఫ్లవర్ తురుము,పచ్చిబటానీలు వేసి కొంచెం వేయించాలి.

ఇప్పుడు పసుపు,తగినంత ఉప్పు,కారం,వేసి కలిపి మూత పెట్టి సన్నని 

సెగపై మగ్గనివ్వాలి.నీరు అంతా ఇగిరిపోయాక గరంమసాల పొడి,

కొత్తిమీర వేసి రెండు నిమిషాలు వేయించి తీసేయ్యాలి.






     
 




Share/Bookmark

Wednesday, August 24, 2011

పల్లీ - పుట్నాల పొడి

వేడివేడి అన్నంలో కారప్పొడీ,నెయ్యి వేసుకుని తింటే ఆ రుచే వేరు.

పల్లీలు,పుట్నాలపప్పు, కలిపి చేసే ఈ పొడి కూడా చాలా రుచిగా 

ఉంటుంది.అన్నంలోనే  కాకుండా ఇడ్లీ,దోశ, ఉప్మాలతో కూడా ఈ 

పొడి చాలా బావుంటుంది.






కావలసిన పదార్ధాలు :


వేయించిన పల్లీలు                            ఒక కప్పు 

పుట్నాల  పప్పు                              ఒక కప్పు

ఎండుకొబ్బరి                                  ఒక  కప్పు

ఎండుమిర్చి                                   పది

జీలకర్ర                                       ఒక టీ స్పూన్ 

వెల్లుల్లి రెబ్బలు                              నాలుగైదు 

ఉప్పు                                          తగినంత 

నూనె                                         అర టీస్పూన్


తయారు చేసే పధ్ధతి :


పల్లీలు పొట్టు తీసుకోవాలి.

నూనె వేడిచేసి ఎండుమిర్చి వేయించుకోవాలి.

మిర్చి,సన్నగా తరిగిన ఎండుకొబ్బరి ముక్కలు,జీలకర్ర,వెల్లుల్లిరెబ్బలు,

ఉప్పు కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి 

ఇప్పుడు పుట్నాలపప్పు వేసి గ్రైండ్ చేసి చివరగా పల్లీలు కూడా వేసి  

గ్రైండ్ చేసుకుంటే రుచికరమైన పల్లీ పుట్నాలపొడి రెడీ అవుతుంది.

ఇదే పొడిని అచ్చంగా పల్లీలతోను,లేదా పుట్నాలతో చేసుకున్నా 

బావుంటుంది.


Share/Bookmark

Friday, August 19, 2011

కార్న్- పల్లీ పకోడా

మొక్కజొన్న పొత్తులతో చేసే మరో రుచికరమైన స్నాక్  ఇది.

వేయించిన  పల్లీలు కూడా కలపడంతో క్రంచీగా బావుంటాయి.









 కావలసిన పదార్ధాలు:



మొక్కజొన్న కండెలు                    రెండు 

వేయించిన పల్లీలు                       ఒక కప్పు 

ఉల్లిపాయ                                 ఒకటి 

మిర్చి                                    నాలుగు 

కొత్తిమీర                                అర కప్పు

అల్లం                                    చిన్నముక్క 

శనగపిండి                                కొద్దిగా

కరివేపాకు                               ఒక  రెమ్మ

ఉప్పు,నూనె



తయారు చేసే విధానం:


మొక్కజొన్నలు వలుచుకోవాలి.వేయించిన పల్లీలు పొట్టు తీయాలి. 

అల్లం,రెండు మిర్చి తగినంత ఉప్పు వేసి మొక్కజొన్నగింజలను మరీ 

మెత్తగా కాకుండా కోర్స్ గా గ్రైండ్ చేసుకోవాలి.

ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ,మిర్చి,కొత్తిమీర,కరివేపాకు 

వేయాలి.బైండింగ్  కోసం శనగపిండి వేసి కలపాలి.

చివరిగా పల్లీలు కలిపి చిన్నచిన్న వడలు చేసి కాగిన నూనెలో ఎర్రగా 

వేయించాలి.

వేడిగా టమాటా సాస్ తో తింటే చాలా బావుంటాయి


Share/Bookmark

Tuesday, August 16, 2011

చోలే మసాలా

రోటీ,చపాతీ,బటూరే ఇలా దేనిలోకైనా చోలే కర్రీ బావుంటుంది.చాలా 

సింపుల్ గా చేసెయ్యొచ్చు కూడా.








కావలసిన పదార్ధాలు :


చోలే                                      రెండు కప్పులు 

ఉల్లిపాయలు                              రెండు 

మిర్చి                                     రెండు 

కరివేపాకు                                ఒక రెమ్మ 

కొత్తిమీర                                  ఒక కట్ట

టమాటాలు                               రెండు 

అల్లం వెల్లుల్లి ముద్ద                     ఒక టీ స్పూన్

గరంమసాలా పొడి                      ఒక  టీ స్పూన్

నూనె                                    రెండు టేబుల్ స్పూన్స్ 

టీ బాగ్                                  ఒకటి 

 ఉప్పు ,కారం,పసుపు

లవంగాలు, చెక్క, యాలకులు, బిర్యానిఆకు, జీలకర్ర 


తయారు చేసే పధ్ధతి :


శనగలను నానబెట్టుకోవాలి 

నూనె వేడిచేసి నాలుగు లవంగాలు,చిన్న దాల్చినచెక్క, రెండు 

యాలకులు, బిర్యానీ ఆకు వేయాలి.

సన్నగా తరిగిన ఉల్లిముక్కలు,మిర్చి,కరివేపాకు వేసి దోరగా 

వేయించాలి.  

అల్లంవెల్లుల్లి ముద్ద వేసి వేగిన తరువాత టమాటాముక్కలు వేయాలి.

ఇప్పుడు పసుపు,కారం వేసి కలిపి చోలే కూడా వేసి కలపాలి.

తగినంత ఉప్పు,టీ బాగ్ వేసి ఒక గ్లాస్ నీళ్ళు పోసి కుక్కర్ మూత పెట్టి 

ఏడెనిమిది విజిల్స్ రానివ్వాలి.

స్టీం పోయాక టీ బాగ్ తీసేసి గరంమసాలా పొడి,కొత్తిమీర వేసి కొంచెం 

చిక్కబడ్డాక స్టవ్ ఆఫ్ చెయ్యాలి.

వేడిగా చపాతీ తో వడ్డిస్తే ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది.


 




Share/Bookmark

Saturday, August 13, 2011

శనగలతో వడలు

శ్రావణ మాసం ఇంటినిండా శనగలు ఉంటాయి.తాలింపు వేసి తినమంటే 

ఎప్పుడూ ఇంతేనా బోర్ అంటారు పిల్లలు.అవేమో మొలకలు 

వచ్చేస్తుంటాయి.అందుకే అల్లం,మిర్చి వేసి రుబ్బి వడలు చేసెయ్యండి.

పది నిమిషాల్లో క్రిస్పీగా కరకరలాడుతూ రెడీ అయిపోతాయి.






కావలసిన పదార్ధాలు :

శనగలు,అల్లం,మిర్చి,జీలకర్ర,ఉల్లిపాయ,కరివేపాకు,కొత్తిమీర,ఉప్పు,

నూనె 



తయారు చేసే పద్ధతి 


శనగలు కడిగి చిన్నఅల్లం ముక్క ,రెండు మిర్చి,తగినంత ఉప్పు,జీలకర్ర

వేసి మెత్తగా గ్రైండ్ చెయ్యాలి.ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ,

ముక్కలు,మిర్చి,కొత్తిమీర,కరివేపాకు వేయాలి

నూనె కాగాక చిన్న చిన్నవడలు చేసి వేయించాలి.పలుచగా చేస్తే కరకర 

లాడుతూ వస్తాయి.వేడిగా సాస్ తోనో,చట్నీతోనో తినడమే.


Share/Bookmark

Monday, August 8, 2011

కొబ్బరి (లౌజు) ఉండలు

 పచ్చికొబ్బరి తురుము,బెల్లంతో చేసే ఈ ఉండలు చేయడం అందరికి

తెలిసిందే.అయితే మైక్రోవేవ్ లో చేస్తే చాలా సింపుల్ గా అయిపోతుంది.







కావలసిన  పదార్ధాలు 


కొబ్బరికాయ                        ఒకటి 

బెల్లం                                రెండు కప్పులు

నెయ్యి                               ఒక స్పూన్

యాలకుల పొడి                    ఒక స్పూన్


తయారు చేసే విధానం :


కొబ్బరి తురుము,బెల్లం కలిపి ఒక మైక్రోవేవ్ సేఫ్ బౌల్ లో వేసి హై లో 

పెట్టాలి.

బెల్లం కరిగి పాకం వస్తుండగా నెయ్యి వేసి కలిపి మళ్లీ ఓవెన్ లో పెట్టాలి 

మిశ్రమం బాగా దగ్గరపడి ఉండకి వస్తుండగా యాలకుల పొడి వేయాలి.

కొంచెం చల్లారిన తరువాత ఉండలు చుట్టుకుంటే రుచికరమైన కొబ్బరి 

ఉండలు రెడీ అవుతాయి .

మైక్రోవేవ్ లో షుమారు పదినిమిషాలు పడుతుంది.రెండు మూడు 

నిమిషాలకి  ఒకసారి కలుపుతూ ఉండాలి.ఓవెన్ ని బట్టి టైం కొంచెం

ఎక్కువ తక్కువలు పట్టొచ్చు






Share/Bookmark

Friday, August 5, 2011

క్రీమీ కార్న్ ఖీర్

లేత మొక్కజొన్న గింజలతో చేసే ఈ ఖీర్ చాలా రుచిగా ఉంటుంది.

ఇప్పుడు సీజన్ కాబట్టి మంచి కండెలు దొరుకుతాయి.ఉడికించిన కార్న్ 

రెడీగా ఉంటే చాలా త్వరగా అయిపోతుంది.








కావలసిన పదార్ధాలు :


మొక్కజొన్న గింజలు                       ఒక కప్పు 

పాలు                                       అర లీటరు 

పంచదార                                   ఒకటిన్నర కప్పు 

ఇలాచీ పొడి                                ఒక స్పూన్ 

నెయ్యి                                      ఒక స్పూన్ 

స్వీట్ కార్న్                               రెండు స్పూన్స్ 

ఇన్స్టంట్ బాదం మిక్స్                  ఒక టీ స్పూన్ (ఆప్షనల్ )


తయారు చేసే విధానం :


మొక్కజొన్న గింజలు ఉడికించి గ్రైండ్ చేసుకోవాలి.అవసరం అయితే 

కొంచెం పాలు పోసి గ్రైండ్ చెయ్యొచ్చు.

పాలు కొద్దిగా మరిగించి ఈ కార్న్ పేస్ట్ వేసి కొంచెం ఉడికిన తరువాత 

పంచదార వేయాలి.

ఖీర్ చిక్కబడుతుండగా ఒక స్పూన్ నెయ్యి, స్వీట్ కార్న్,ఇలాచీపొడి,

బాదంమిక్స్ వేసి రెండు నిముషాలు సిమ్ లో ఉంచి స్టవ్ ఆఫ్ చెయ్యాలి.

బాదంమిక్స్ వేస్తే కొంచెం కలర్,ఫ్లేవర్ వస్తుంది.ఇది లేకపోయినా పర్లేదు

కాసేపు ఫ్రిజ్ లో ఉంచి చల్లగా సర్వ్ చేస్తే బావుంటుంది.

కావాలంటే కాజూ నేతిలో వేయించి వేసుకోవచ్చు






Share/Bookmark

Tuesday, August 2, 2011

చికెన్ పకోడా

చికెన్ తో ఎన్నోవెరైటీలు.వాటిలో స్పైసీగా నోరూరించే ఐటం ఈ పకోడీలు.

చికెన్ మారినేట్ చేసి ఉంచుకుంటే చేయడం చాలా తేలిక.పదినిమిషాల్లో 

వేడిగా రెడీ అయిపోతాయి.చల్లని వర్షపు సాయంత్రాలకు పర్ ఫెక్ట్ జోడీ.






కావలసిన పదార్ధాలు ;


బోన్ లెస్ చికెన్                       పావుకిలో 

అల్లంవెల్లుల్లి ముద్ద                   ఒక టీ స్పూన్ 

గరం మసాల పొడి                    ఒక టీ స్పూన్ 

ఉప్పు,కారం                            తగినంత 

పసుపు                                 కొంచెం 

పచ్చిమిర్చి                            రెండు 

కొత్తిమీర                               ఒక కట్ట 

కరివేపాకు                             ఒక రెమ్మ 

ఉల్లి కాడలు                           రెండు టేబుల్ స్పూన్స్  

శనగపిండి                            రెండు టేబుల్ స్పూన్స్ 

కార్న్ ఫ్లోర్                            ఒక టేబుల్ స్పూన్ 

నూనె 


తయారు చేసే విధానం:


చికెన్ ముక్కల్లో అల్లంవెల్లుల్లి ముద్ద,గరంమసాల పొడి,ఉప్పు,కారం,

పసుపు వేసి కలిపి ఒక గంటసేపు మారినేట్ చేసుకోవాలి.

ఇందులో సన్నగా తరిగిన మిర్చి,ఉల్లికాడలు,కొత్తిమీర,శనగపిండి,

కార్న్ ఫ్లోర్ వేసి కొంచెం నీరు చల్లి కలుపుకోవాలి.బాటర్ లాగ అక్కర్లేదు 

జస్ట్ చికెన్ ముక్కలకు కోట్ అయితే చాలు.

కాగిన నూనెలో చికెన్ ముక్కలు వేసి వేయించి తీసుకోవాలి.

అదే నూనెలో కరివేపాకు కూడా వేయించుకోవాలి.

చికెన్ పకోడీలపై వేయించిన కరివేపాకు చల్లి వేడిగా సర్వ్ చేయడమే.


Share/Bookmark

అభిరుచి   © 2008. Template Recipes by Emporium Digital

TOP